ఏపిలో వైసీపి విజయం..కానీ రోజా ఓడుతుందటున్న సర్వేలు..! జబర్దస్త్ గా గెలుస్తానంటున్న ఫైర్ బ్రాండ్..!!

Recommended Video

    Exit Polls 2019 : ఏపిలో వైసీపి గెలిచినా.. రోజా ఓటమి మాత్రం ఖాయం || Oneindia Telugu

    అమరావతి/హైదరాబాద్ : ఊరంతా ఒక దారైతే రంగడిది గోదారన్నట్టుంది ఏపి వైసీపిలో రోజా పరిస్థితి. ఏపిలో వైసీపి ఘన విజయం సాధిస్తుందని రెండు మూడు సర్వేలు తప్ప అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసాయి. కాని ఇందులో ఓ మెలిక కూడా పెట్టాయి సర్వే సంస్థలు. వైసీపి విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకొస్తున్నప్పటికి ఆ సర్వే ఫలితాలను కొట్టి పారేస్తున్నారు రోజా. వైసీపి అదికారంలో కి వస్తుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ తన ఓటమి గురించి చెప్పడాన్ని తప్పుబడుతున్నారు రోజా.

    ఎగ్జిట్ పోల్ ఫలితాలు తప్పు..! నమ్మేది లేదంటున్న రోజా..!!

    ఎగ్జిట్ పోల్ ఫలితాలు తప్పు..! నమ్మేది లేదంటున్న రోజా..!!


    ఏపీ ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఇప్పుడు రాజకీయ నేతలతో టెన్షన్ మొదలైంది. కొందరు ముఖ్య నేతలు ఓడిపోతున్నట్లుగా సర్వేలు చెప్పాయి. వైసీపీలో ఏకైక ఫిమేల్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా... నగరిలో ఓడిపోతారని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. ఆమె ఓటమికి దారితీసిన అంశాలేమిటనేది చర్చనీయాంశాలయ్యాయి. వైసీపీ గెలిస్తే, రోజాకు హోం మంత్రి పదవి ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. అందువల్ల కొందరు చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలే నగరిలో రోజా ఓటమికి స్కెచ్ గీసినట్లు తెలుస్తోంది.

     ఏపిలో జగన్ పార్టీ గెలుస్తుంది..! కానీ రోజా ఓడుతుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్..!!

    ఏపిలో జగన్ పార్టీ గెలుస్తుంది..! కానీ రోజా ఓడుతుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్..!!

    రోజాను ఓడించేందుకు ఆ నియోజకవర్గంలోని వైసీపీ సీనియర్ నాయకులు ప్రయత్నించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె గెలిస్తే, మంత్రిగా మారితే... పార్టీలో తమను అణగదొక్కుతుందని, గుర్తింపు ఉండదనిని భయపడిన కొందరు సీనియర్లు... ఆమెను ఓడించేందుకు తెర వెనుక నుంచి కథ నడిపించారు. టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే దివంగత గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారుడు పోటీ చేశారు. ముద్దుకృష్ణమపై ఇక్కడి ఓటర్లలో ప్రేమాభిమానాలు ఉన్నాయి. జనం మనిషిగా ఆయనకు పేరుంది. ఆయన చనిపోయిన తరువాత రాజకీయాలకతీతంగా అనేకమందిలో సానుభూతి పెరిగింది. ఇది, టీడీపీ అభ్యర్థికి ఉపయోగపడింది.

     ఎగ్జిట్ పోల్స్ పై మండి పడుతున్న రోజా..! గెలిచి చూపిస్తానంటున్న జబర్దస్త్ ఆంటీ..!!

    ఎగ్జిట్ పోల్స్ పై మండి పడుతున్న రోజా..! గెలిచి చూపిస్తానంటున్న జబర్దస్త్ ఆంటీ..!!

    రోజా దూకుడుతో అసెంబ్లీలో చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఆమె నోటి ధాటికి ధీటుగా జవాబిచ్చే ఫైర్ బ్రాండ్ లేడీ లీడర్ కూడా టీడీపీలో లేరు. రోజా గెలిస్తే, ఆమెతో ఇబ్బంది ఉంటుందని భావించిన చంద్రబాబు కూడా... నగరిలో టీడీపీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన శక్తియుక్తులను ప్రయోగించారు. గత ఎన్నికల్లో కేవలం 800 లోపు మెజారిటీతోనే రోజా గెలిచారు. దీనినిబట్టి, ఆనాడు అక్కడ ఎంత టఫ్ పోటీ నడిచిందో అర్థం చేసుకోవచ్చు. ముద్దు కృష్ణమ మరణం, చంద్రబాబు దృష్టి కేంద్రీకరించడంతో ఈసారి అక్కడ రోజా ఓటమి అనివార్యంగా మారిందనే చర్చ జరుగుతోంది.

    పార్టీ గెలుస్తుంది..! తాను కూడా గెలుస్తానంటున్న రోజా..!!

    పార్టీ గెలుస్తుంది..! తాను కూడా గెలుస్తానంటున్న రోజా..!!

    రోజా మనసులో ఏముందోగానీ, బయటకు మాత్రం గెలుపై ధీమాతో ఉన్నారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. ఎగ్జిట్ పోల్స్ ను గుడ్డిగా నమ్మలేం. నేనైతే ఇలాంటి సర్వేలను నమ్మను అంటున్నారు రోజా. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు వైసీపి అదికారంలోకి రావడం ఖాయమైనప్పుడు తన గెలుపు కూడా తథ్యమని ఆమె అంటోంది. ఐతే రోజా చెప్పింది ఎంతవరకూ వాస్తవమో తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడక తప్పదు మరి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+