ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్ .. పసుపు కుంకుమ పథకంపై సెటైర్లు .. పసుపు బాబుకు రాసి బొట్టు జగన్ కు పెట్టారట

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల కోడ్ ముగియడంతో పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా వెల్లడించాయి. అయితే ఏపీలో అధికార పార్టీ టీడీపీ అంచనాలను తారుమారు చేసి ఎన్నికల ఫలితాల ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. ఏపీ ఎన్నికల్ని పరిశీలిస్తే చంద్రబాబు ఏపీలో మహిళల ఓటు బ్యాంకు ఎక్కువగా వుందని పసుపు కుంకుమ పధకం ద్వారా మహిళల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం సఫలం అయ్యిందని మహిళలు చంద్రబాబును ఆశీర్వదించారని టీడీపీ నేతలు భావించారు. కానీ డ్యామిడ్ కథ అడ్డం తిరిగింది అన్న చందంగా ఎగ్జిట్ పోల్స్ పలితాలు పసుపు కుంకుమ ప్రభావం ఏ మాత్రం లేదని తేల్చి చెప్పేశాయి .

చంద్రబాబు అందించిన పథకం పసుపు కుంకుమ .. ఆదరించలేదు అని తేల్చిన ఎగ్జిట్ పోల్స్

చంద్రబాబు అందించిన పథకం పసుపు కుంకుమ .. ఆదరించలేదు అని తేల్చిన ఎగ్జిట్ పోల్స్

ఐదేళ్ల చంద్రబాబు బాబు పాలనపై వచ్చినన్ని విమర్శలు.. ఆరోపణలు అన్ని ఇన్ని కావు. ఇక వైసీపీ అధినేత జగన్ చంద్రబాబుపై వస్తున్న వ్యతిరేఖత ప్రజా క్షేత్రంలోకి వెళ్లి మరీ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. జగన్ పాదయాత్ర చాలా ప్రభావవంతంగా పని చేసిందని తేల్చాయి సర్వేలు . కానీ చంద్రబాబు ఎన్నికల ముందు మహిళల కోసం అందించిన పసుపు కుంకుమ పథకం మాత్రం అనుకున్న ఫలితాలను ఇవ్వలేకపోయింది. పోలింగ్ కు కాస్త ముందు ఆడబడుచుల అకౌంట్లలోకి పసుపు కుంకమ డబ్బులు వేస్తే సంతోషంతో ఓట్లు వేస్తారనుకున్నారు చంద్రబాబు. కానీ పసుపు కుంకుమ పథకం ఏ మాత్రం తమకు అనుకూల ఫలితం ఇవ్వలేకపోయిందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ద్వారా తెలుసుకున్నారు చంద్రబాబు.

మహిళా లోకాన్ని నమ్ముకున్న టీడీపీ .. బాబు ఓటమి పక్కా అంటున్న ఎగ్జిట్ పోల్స్

మహిళా లోకాన్ని నమ్ముకున్న టీడీపీ .. బాబు ఓటమి పక్కా అంటున్న ఎగ్జిట్ పోల్స్

టీడీపీ నేతలు పలువురు తమను పసుపు కుంకమ పథకం బయటపడేస్తుందన్న ధీమాను వ్యక్తం చేయటం తెలిసిందే. మహిళల్ని నమ్ముకున్న టీడీపీ నేతలు మహిళలే చంద్రబాబుకు పట్టం కడతారని చెప్పారు. చంద్రబాబు సైతం చాలా ధీమా వ్యక్తం చేశారు . కానీ బాబు ఓటమి నుంచి బయటపడలేరన్న విషయాన్ని తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి. ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించిన సంస్థల్లో అత్యధికం వైఎస్సార్ కాంగ్రెస్ కు విజయం పక్కా అని తేల్చి చెప్పాయి.

చంద్రబాబుకు పసుపు రాసి జగన్ కు కుంకుమ పెట్టారని ఎగ్జిట్ పోల్స్ పై సెటైర్లు

చంద్రబాబుకు పసుపు రాసి జగన్ కు కుంకుమ పెట్టారని ఎగ్జిట్ పోల్స్ పై సెటైర్లు

ఈ సందర్భంగా బాబు నమ్ముకున్న పసుపు కుంకమ పథకం మీద తెలుగు రాష్ట్రాల్లో పంచ్ లు మొదలయ్యాయి . చంద్రబాబు మహిళల కోసం అందించిన పసుపుకుంకమ పథకాన్ని బాబు అర్థం చేసుకున్నది ఒకటైతే ఓటర్లు మరో విధంగా అర్ధం చేసుకున్నారు. పసుపు కుంకుమ పథకంలోని పసుపును చంద్రబాబుకు రాసి.. జగన్ కు కుంకమ బొట్టు పెట్టారని ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీ విజయకేతనం ఎగురవేస్తుందని తెలిసిన వారు సెటైర్లు వేస్తున్నారు. పాపం చంద్రబాబుకు మహిళలు పసుపు రాశారని కానీ విజయ తిలకం జగన్ కు దిద్దారని ఈ పథకంపై రాష్ట్ర వ్యాప్త చర్చ జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+