AP Assembly and Lok Sabha Exit Poll LIVE: పోస్టల్ బ్యాలెట్లపై సుప్రీం అత్యవసరణ విచారణ కోరిన వైసీపీ
ఎగ్జిట్ పోల్స్ 2024 ఇటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా జూన్ 1వ తేదీన సాయంత్రం 6:30 గంటల నుంచి సందడి కనిపించనుంది. ఇందుకు కారణం సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగియడం ఆ పై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో పలు సర్వే ఏజెన్సీలు, మీడియా సంస్థలు సిద్ధంగా ఉండండం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో విజయం తమదంటే తమదే అని ఇటు వైసీపీ అటు టీడీపీ కూటమి కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎవరు గెలిచినా విజయం ఏకపక్షంగానే ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి, వైసీపీ మధ్య హోరా హోరీ పోరు సాగింది. పోలింగ్ సరళి పైన రెండు వైపులా క్షేత్ర స్థాయి నుంచి పూర్తి స్థాయి లో సమీక్షజరిగింది. తమకు దక్కే సీట్ల పైన జగన్, చంద్రబాబు పూర్తి క్లారిటీతో ఉన్నారు. పార్టీల అధ్యక్షులుగా ఏం చెప్పాలో పార్టీ నేతలతో అదే చెబుతున్నారు. కానీ, వాస్తవం ఏంటనేది ఇద్దరికీ స్పష్టత ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పేరుగాంచిన 8 సర్వే సంస్థలు తమ ఫలితాలతో సిద్ధంగా ఉన్నాయి. ఏ సర్వే సంస్థ ఎవరికి ఎన్ని సీట్లు ఇచ్చిందో తెలుసుకునేందుకు మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.













Click it and Unblock the Notifications