ఏపీలో 2027లోనే ఎన్నికలు, ఢిల్లీ సంకేతాలు - కలిసొచ్చేదెవరికి..!!

ఏపీలో ముందస్తుగానే ఎన్నికలు జరగనున్నాయా. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఈ సంకేతాల పై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరిగింది. ఆ తరువాత చంద్రబాబు సైతం జమిలికి సానుకూలంగా వ్యాఖ్యలు చేసారు. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో జమిలి బిల్లు తేవాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో, 2027 సెకాండాఫ్ లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఏపీలో కలిసొచ్చేదెవరికి. చంద్రబాబు .. జగన్ ప్లాన్ ఏంటి.

జమిలి బిల్లు వేళ
తాజాగా ఢిల్లీ పర్యటన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు జమిలి ఎన్నికలకు మద్దతు ప్రకటించారు. కేంద్రం జమిలి దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. ఎన్నికలకు ముందే దీనికి సంబంధించి కేంద్రం పక్కా ప్లాన్ తో వ్యవహరించింది. మాజీ రాష్ట్రపతి కోవింద్ తో కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం కేంద్రం ఆ రిపోర్టును ఆమోదించింది. శీతాకాల పార్లమెంట్ సమావేశా ల్లో జమిలికి సంబంధించిన బిల్లులను ఆమోదించేలా కార్యారణ సిద్దం అవుతోంది. ఇదే సమయం లో ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేత సీఎం చంద్రబాబు సైతం జమిలికి మద్దతు ప్రకటించారు.

Expecting early polls in AP As central planning for one nation one Election

2027లోనే ఎన్నికలు
పార్లమెంట్ తో పాటుగా ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగటం ఖాయంగా కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం 2029 మార్చి తరువాత ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ఢిల్లీ ముఖ్య నేతల్లో జరుగుతున్న చర్చ మేరకు 2027 జూన్ నుంచి ఎప్పుడైనా జమిలి జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు ఖాయమనే అభిప్రాయం ఉంది. దీంతో..ఈ నిర్ణయానికి మద్దతు ప్రకటిస్తూనే.. ఆ దిశగానే పాలనా పరంగా. రాజకీయంగా చంద్రబాబు నిర్ణయాలు అమలు చేసేలా సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తీసుకొచే బిల్లుల ద్వారా సాంకేతిక సమస్యలను సైతం అధిగమించి జమిలి నిర్వహణకు మోదీ ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. దీంతో, ఏపీలోనూ 2027 లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే చర్చ బలంగా వినిపిస్తోంది.

ఎవరి లెక్కలు వారివే
కలిసొచ్చేదెవరికి అదే జరిగితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు మాత్రమే పూర్తవుతుంది. దీంతో.. తమ హామీల అమలు..రాజధాని...పోలవరం చంద్రబాబుకు ప్రధాన అంశాలుగా మారనున్నాయి. ఇదే మూడు పార్టీల కూటమిగా ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. అటు మాజీ సీఎం జగన్ తిరిగి తమకు అధికారం దక్కటం ఖాయమనే ఇప్పటికే చెబుతున్నారు. పార్టీ ప్రక్షాళన నిర్ణయాలు తీసుకుంటూనే..కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో.. జమిలి 2027 ద్వితీయార్ధంలో జరిగితే ఎవరికి కలిసి వస్తుందనే లెక్కలు మొదలయ్యాయి. వచ్చే జనవరి నుంచి ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+