ఉచితం ప్రయాణం.. మహిళలకు APSRTC శుభవార్త
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తోన్నారు. వివిధ నగరాలు, జిల్లా కేంద్రాలకు మరిన్ని ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు బస్సులను అందుబాటులోకి వస్తోన్నారు. రద్దీ మార్గాల్లో వాటిని ప్రవేశపెడుతున్నారు. త్వరలో రానున్న కార్తీక మాసంలో మహిళా ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను కూడా అందుబాటులోకి తీసుకుని రానున్నారు.
ఆలయ పర్యాటకానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోన్నందున రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. తాజాగా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి ప్రఖ్యాత శైవక్షేత్రాలకు బస్ సర్వీసులను పెంచడంతో పాటు ప్రత్యేక ప్యాకేజీ టూర్లను కూడా ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది.

ఈ నెల 20వ తేదీన దీపావళి. మరుసటి రోజు నుంచే కార్తీకమాసం ఆరంభమౌతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాసం ముగిసేంత వరకు ప్రతి శని, ఆదివారాల్లో పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడిపించనున్నారు ఆర్టీసీ అధికారులు. ఈ నెల 25వ తేదీ నుంచి నవంబర్ 16వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ పట్టణాల, జిల్లా కేంద్రాల నుంచి పంచారామాలకు బస్సులు నడుస్తాయి. ఈ నెల 25, 26, నవంబరు 1, 2, 8, 9, 15, 16 తేదీల్లో పంచారామ క్షేత్రాలకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది.
ఈ బస్సులు శని, ఆదివారాల్లో రాత్రి 8 గంటలకు కాకినాడ నుండి బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 8 గంటలకు పంచారామ క్షేత్రాలను చేరుకుంటాయి. దర్శనానంతరం మళ్లీ గమ్యస్థానానికి తిరుగుముఖం పడతాయి. అలాగే- అయ్యప్ప స్వామి భక్తుల అవసరాల మేరకు రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి శబరిమలకు కూడా ప్రత్యేక బస్సులు నడపించనున్నారు. దీనికి సంబంధించిన ప్రణాళికలను రీజియన్లవారీగా రూపొందిస్తోన్నారు.












Click it and Unblock the Notifications