రాజధాని అమరావతి వద్ద అద్దిరిపోయే రైల్వే స్టేషన్- చర్లపల్లి తరహాలో.. !!
రాజధాని అమరావతి పరిధిలో విజయవాడ సమీపంలో ఉన్న రాయనపాడు రైల్వేస్టేషన్ కు మహర్దశ పట్టింది. సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అమృత్ భారత్ స్టేషన్లల్లో భాగంగా ఇది పునర్నిర్మితమౌతోంది. అత్యాధునిక వసతులు సమకూరుతున్నాయి. దీని పునర్నిర్మాణ పనులు దాదాపుగా 80 శాతం వరకు పూర్తి అయ్యాయి. వచ్చే ఏడాది ఈ రైల్వే స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
ప్రయాణికులకు ఆధునిక, మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రధాన లక్ష్యం. అమృత్ భారత్ కింద ఎంపిక చేసిన స్టేషన్లను డెవలప్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, ఆదోని, అనంతపురం, చీరాల, చిత్తూరు, కడప,ధర్మవరం, గుడివాడ, గుత్తి, గుంటూరు, హిందూపురం, కదిరి, కాకినాడ టౌన్, కొత్తవలస జంక్షన్, కుప్పం, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, రాజంపేట, రేణిగుంట వంటివి ఉన్నాయి.

ఇందులో భాగంగా రాయనపాడు స్టేషన్ లో ప్లాట్ ఫామ్ ల నిర్మాణం, వెయిటింగ్ హాళ్లు, టికెట్లు కౌంటర్లు, ప్లాట్ ఫామ్ లపై షెడ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయ్యాయి. రైల్వే స్టేషన్ ఆధునీకరించిన వసతులతో సరికొత్తగా అందుబాటులోకి రానుంది. కొత్త ముఖద్వారం, విశాలమైన సర్క్యులేటింగ్ ఏరియా, సౌకర్యవంతమైన వెయిటింగ్ హాల్, లిఫ్టులు, ఆధునిక టాయిలెట్లు, మెరుగుపరచిన ప్లాట్‌ఫారమ్ ఉపరితలం వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.
ఈ అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత మరిన్ని రైళ్లు ఆగేందుకు అవకాశం ఉంటుంది. ఫలితంగా- విజయవాడ రైల్వేస్టేషన్ పై ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం విజయవాడలో నిత్యం వందకు పైగా రైళ్లు ఆగుతుంటాయి. ప్రయాణికుల తాకిడి అధికం. దీనికి ప్రత్యామ్నాయంగా రాయనపాడు స్టేషన్ ను అభివృద్ధి చేయడం వల్ల మరికొన్ని రైళ్లకు ఇక్కడ హాల్ట్ సౌకర్యం కల్పించడానికి వీలవుతుంది. నిజానికి- విశాఖపట్నం వైపు వెళ్లడానికి అటు వైపు నుంచి వచ్చే రైళ్లు విజయవాడకు రాకుండానే రాయనపాడు స్టేషన్ కు వచ్చేలా ట్రాక్ ఉంది. ఇక్కడ వసతులు లేకపోవడం వల్ల రైళ్లు ఆగట్లేదు.
విశాఖ-నాందేడ్, కాకినాడ పోర్ట్-లింగంపల్లి, నాందేడ్-సంబాల్‌పూర్, కాకినాడ టౌన్-లింగంపల్లి వంటి పరిమిత రైళ్లు ఇక్కడ ఆగుతున్నాయి. ఈ అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం మరిన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లకు ఇక్కడ హాల్ట్ కల్పించే అవకాశం ఉంది. విజయవాడకు ప్రత్యమ్నాయ టెర్మినల్ గా ఇది అందుబాటులోకి వస్తుంది. చర్లపల్లి తరహాలో దీన్ని డెవలప్ చేయాలని ప్రయాణికులు సైతం చాలాకాలం నుంచీ కోరుకుంటోన్నారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications