Vande Bharat: కోనసీమలో తొలి వందేభారత్...! రేపే ప్రారంభం...!

ఏపీలో వందేభారత్ ప్రయాణికులకు రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకూ విజయవాడ-విశాఖ మార్గంలోనే పరుగులు తీస్తున్న వందేభారత్ తొలిసారిగా కోనసీమలో నుంచి పరుగులు తీయబోతోంది. దీంతో తొలిసారి కోనసీమ వాసులు వందేభారత్ ప్రయాణాన్ని ఆస్వాదించబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి. రేపు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఈ రైలును ప్రారంభిస్తారని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

చెన్నై నుంచి విజయవాడ వరకూ ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును రేపటి నుంచి నరసాపురం వరకూ నడిచేలా మార్పు చేశారు. దీంతో నరసాపురం నుంచి చెన్నైకు ప్రయాణించే వందే భారత్ రైలును కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ రేపు మధ్యాహ్నం 1.30కు ప్రారంభిస్తారు. నరసాపురం నుంచి బయలుదేరిన తర్వాత భీమవరం టౌన్, గుడివాడ స్టేషన్లలో ఈ రైలుకు కొత్తగా హాల్ట్ లు ఇచ్చారు. అలాగే చెన్నై నుంచి నరసాపురానికి వచ్చే రైలు కూడా ఈ స్టేషన్లలో ఆగనుంది.

Extended Narasapur-Chennai Vande Bharat Express to be Inaugurated Tomorrow

నరసాపురం-చెన్నైవందేభారత్ రైలుకు జనవరి 11 వరకూ తాత్కాలిక షెడ్యూల్ ఇచ్చారు. అనంతరం కొత్త షెడ్యూల్ ఇస్తారు. దాని ప్రకారమే ఈ రైలు నరసాపురం నుంచి చెన్నైకు ప్రయాణించబోతోంది. తాజా మార్పుల ప్రకారం ఈ రైలు నరసాపూర్ , చెన్నై మధ్య 655 కి.మీ దూరాన్ని కేవలం 9 గంటల్లోనే ప్రయాణిస్తుంది. ఈ రైలులో ఏడు ఏసీ చైర్ కార్ కోచ్‌లు , ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్‌ ఉంటాయి. 530 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతో ఇది ప్రయాణిస్తుంది. ఈ రైలు మంగళవారం తప్ప వారంలో మిగతా రోజులు ప్రయాణిస్తుంది.

Extended Narasapur-Chennai Vande Bharat Express to be Inaugurated Tomorrow

జనవరి 11వ తేదీ వరకూ మాత్రమే వర్తించే తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ నరసాపురంలో మధ్యాహ్నం 2.50కి బయలుదేరి, భీమవరంలో 3.19కి, గుడివాడలో 4.04కి, విజయవాడలో 4.50కి, తెనాలిలో 5.19కి, ఒంగోలులో 6.29కి , నెల్లూరులో 7.39కి, రేణిగుంటలో 9.50కి ఆగుతుంది. చివరిగా 11.45కు చెన్నై సెంట్రల్ స్టేషన్ కు చేరుతుంది. తిరిగి చెన్నై సెంట్రల్ లో ఉదయం 5.30కి బయలుదేరే వందేభారత్.. రేణిగుంటలో 7.05కి , నెల్లూరులో 8.39కి, ఒంగోలులో 10.09కి , తెనాలిలో 11.21కి, విజయవాడలో 11.45కి, గుడివాడలో 12.28కి , భీమవరంలో 1.15కి ఆగుతుంది. చివరిగా నరసాపురానికి 2.10కి చేరుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+