విశాఖపట్నం నుంచి ప్రత్యేక రైలు పొడిగింపు- ఆ రద్దీ రూట్ ఇదే..!!
Special Trains from Visakhapatnam: పండగ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తోన్నారు కూడా. పండగ సీజన్ ముగిసేంత వరకు ఈ పొడిగింపు కొనసాగుతుంది. పలు రద్దీ మార్గాల్లో ఈ రైళ్ల పొడిగింపు ఉంటోంది. అదే సమయంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వాముల తాకిడి కూడా అధికంగా ఉండటం కలిసొచ్చినట్టవుతోంది. గతంలో నిర్దేశించిన గడువు ముగిసిపోతుండటం, ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకుంటోన్నారు.

ఈ క్రమంలో తాజాగా విశాఖపట్నం నుంచి ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య నడిచే ప్రత్యేక రైలును పొడిగించారు. నిజానికి- గతంలో ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ ఎక్స్ ప్రెస్ చివరి సర్వీస్ డిసెంబర్ 7వ తేదీ నాటికి ముగియాల్సి ఉంది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో ఈ సర్వీసును 28వ తేదీ వరకు పొడిగించారు. అలాగే బెంగళూరు నుంచి విశాఖపట్నం వచ్చే చివరి సర్వీస్ 29న బయలుదేరుతుంది. దీని సమయాన్ని రివైజ్ చేశారు.
డిసెంబర్ 28వ తేదీ వరకు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3:20 నిమిషాలకు విశాఖపట్నం నుంచి బయలుదేరే నంబర్ 08581 ప్రత్యేక రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 12:45 నిమిషాలకు బెంగళూరుకు చేరుకుంటుంది.
డిసెంబర్ 29వ తేదీ వరకు ప్రతి సోమవారం మధ్యాహ్నం 3:50 నిమిషాలకు బెంగళూరు నుంచి బయలుదేరే నంబర్ 08582 ప్రత్యేక రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది.
దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్ పేట్టై, కుప్పం, బంగార్ పేట, కేఆర్ పురం మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.












Click it and Unblock the Notifications