భర్త ఉండగానే మరొకరితో భార్య: చంపి, ఇంట్లోనే పాతిపెట్టాడు

Subscribe to Oneindia Telugu

విజయవాడ: వివాహేతర సంబంధం కారణంగా కట్టుకున్న భార్యను చంపేసి ఇంటి వెనుకాల పాతిపెట్టాడు ఓ దుర్మార్గపు భర్త. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్లుగా నాటకమాడుతూ వచ్చాడు. అయితే, మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అసలు విషయం వెలుగులోకి తెచ్చారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. అజితసింగ్‌ నగర్‌ వాంబే కాలనీలో ఉంటున్న కె.దుర్గాప్రసాద్‌ అలియాస్‌ ఎలక్ర్టికల్‌ ప్రసాద్‌కు మరియమ్మతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు. ప్రసాద్‌ ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది నెలల క్రితమే నూతనంగా నిర్మించిన బ్లాక్‌లోని జీఎఫ్‌-2 ఫ్లాట్‌లో అద్దెకు దిగాడు. మరియమ్మ తల్లి రేపల్లె కుమారి రెండు నెలల క్రితం ఇంటికి వచ్చింది. కుమార్తె, పిల్లలు కనిపించకపోవడంతో అల్లుడు దుర్గాప్రసాద్‌ను ప్రశ్నించింది. పిల్లలతో కలిసి గుడివాడలోని బంధువుల ఇంటికి వెళ్లిందని చెప్పాడు. ఇది నిజమేననుకుని కుమారి నమ్మింది.

అయితే, కుమారి ఎప్పుడు అడిగినా దుర్గాప్రసాద్‌ ఇదే సమాధానం చెబుతున్నాడు. దీనిపై ఆమెకు అనుమానం వచ్చి అజితసింగ్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ జరిపిన పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు. తన భార్య ఓ ఆటోడ్రైవర్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతోనే చంపేశానని దుర్గాప్రసాద్‌ చెప్పాడు. మార్చి 6న తన ఇంట్లో మరియమ్మతో పాటు మరోవ్యక్తి ఉండగా చూశాడు.
దీంతో మరియమ్మను ప్రశ్నించాడు. అది కాస్తా ఘర్షణకు దారితీసింది.

extramarital affair: A man allegedly murdered his wife

ఆ సమయంలో ప్రసాద్‌ ఆమెను బలంగా కొట్టి, గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని రెండు రోజులుపాటు ఇంట్లోనే ఉంచి, అర్ధరాత్రి ఇంటి వెనుక గొయ్యి తీసి పాతిపెట్టాడు. దానిపై మట్టి వేయడంతోపాటు సిమెంట్‌తో ప్లాస్టిరింగ్‌ చేశాడు. కాగా, నిందితుడు ఇచ్చిన సమాచారంతో.. మరియమ్మ మృతదేహాన్ని బయటికి తీసి వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించారు.

కాగా, దుర్గాప్రసాద్‌ ఇంట్లో గాలింపు జరిపిన పోలీసులు కొన్ని ఫొటో ఆల్బమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. భార్య మరియమ్మతో కాకుండా మరో మహిళతో కలిసి దుర్గాప్రసాద్‌ ఉన్న ఫొటోలు లభ్యమయ్యాయి.కాగా, వీటి గురించి మరియమ్మకూ తెలుసని నిందితు చెబుతున్నాడు.

తన భార్య తమ వివాహం అనంతరం మరియమ్మ ఓ ఆటోడ్రైవర్‌తో వివాహేతర సంబంధం కలిగి ఉండేదని, అతడితోనే కలిసి వెళ్లిపోయిందని చెప్పాడు. ఆ తర్వాత తాను మరో మహిళను వివాహం చేసుకున్నానని, కానీ, ఆటోడ్రైవర్‌ వేధింపులు భరించలేక మరియమ్మ తన వద్దకు మళ్లీ వచ్చేసిందని దుర్గా ప్రసాద్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత కూడా రహస్యంగా ఆటో డ్రైవర్‌తో వివాహేతర బంధం కొనసాగించిందని, దీంతో ఆమెను హత్య చేసినట్లు తెలిపాడు దుర్గాప్రసాద్. కాగా, మరియమ్మ హత్యకు కారణమైన నిందితులందర్నీ కఠినంగా శిక్షించాలంటూ ఆమె కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man allegedly murdered his wife in Vijayawada, due to extramarital affair.
Please Wait while comments are loading...