బంధువుతో అక్రమ సంబంధం: అడ్డుగా ఉన్నాడని భర్తను నిర్దాక్షిణ్యంగా..

Subscribe to Oneindia Telugu

కర్నూలు: గత నెల 31న పత్తికొండ పట్టణంలో హత్యకు గురైన కృష్ణ అనే హత్య కేసును పోలీసులు చేధించారు.వివాహేతర సంబంధమే అతని హత్యకు కారణంగా తేల్చారు. కృష్ణ భార్య ప్రియుడితో కలిసి ఈ హత్య చేసినట్లు తెలిపారు.

ఈ మేరకు ఎస్ఐ మదుసూదన్‌తో కలిసి సీఐ విక్రమ్ సింహ వివరాలు వెల్లడించారు. పత్తికొండ పట్టణంలోని కుమ్మరివీధిలో భార్యతో కలిసి కృష్ణ కొన్నేళ్లుగా నివాసముంటున్నాడని చెప్పారు.కృష్ణకు సమీప బంధువైన అరుణ్ కుమార్ నంద్యాల ఎంబీఏ చదువుతూ.. వీరి ఇంటికి తరుచూ వస్తూ వెళ్తూ ఉండేవాడు.

extramarital affair: wife, lover arrested for husband's murder

ఈ క్రమంలో అరుణ్‌కు కృష్ణ భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే వీరి సంబంధానికి కృష్ణ అడ్డువస్తాడని భావించారు. దీంతో అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం గత నెలలో అరుణ్ రెండు రోజుల పాటు అక్కడే మకాం వేశాడు.

జులై 31 తెల్లవారు ఝామున కృష్ణ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో.. అతని భార్య నీలిమ, ప్రియుడు అరుణ్ కలిసి అతని గొంతు నులిమి హత్య చేశారు. ఇందుకు సంబంధించి కాల్ డేటా, వీడియో ఫుటేజీ ఆధారాలు కూడా సేకరించామని చెప్పారు. అన్ని కోణాల్లో విచారించిన తర్వాత దీన్ని హత్య కేసుగా నమోదు చేసినట్లు తెలిపారు.

శనివారం సాయంత్రం 4.30గం. సమయంలో కోడమూరు బస్టాండ్ సమీపంలో నీలిమ, అరుణ్ లను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇరువురిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా.. నిందితులను రిమాండ్ కు తరలించాల్సిందిగా ఆదేశించినట్లు వివరించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman has been arrested along with her paramour for killing her husband to hide their illicit relationship, police said on Saturday.
Please Wait while comments are loading...