Fact Check: కల్తీ జరిగిందా ? లేదా ? సిట్ రిపోర్ట్ లో ఏముంది ?
ఏపీలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీ జరిగిందని, ఇందులో జంతుకొవ్వు, పందికొవ్వు కలిశాయంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలతో సుప్రీంకోర్టు వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు సిట్ ను నియమించింది. సిట్ తాజాగా దర్యాప్తు పూర్తి చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. అలాగే ప్రభుత్వానికి కూడా ఓ నివేదిక ఇచ్చింది. అయితే సిట్ రిపోర్ట్ పూర్తిగా బయటికి రాకపోవడంతో ఇందులో అసలు కల్తీ ప్రస్తావనే లేదని వైఎస్సార్సీపీ ప్రచారం చేసుకుంటోంది. దీనిపై ప్రభుత్వం స్పందించింది.
తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ కాలేదంటూ వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో చేసుకుంటున్న ప్రచారంపై ప్రభుత్వం (ap govt)ఎక్స్ లో ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పందించింది. నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్ లో నెయ్యి కల్తీపై స్పష్టమైన ఆధారాలు ఇచ్చిందని తెలిపింది. టీటీడీ సూచనల మేరకు జరిపిన పరీక్షల్లో నెయ్యిలో వృక్ష సంబంధ నూనెలు, జంతుకొవ్వు ఉన్నట్లు జాతీయ స్థాయి పరిశోధనా సంస్థ ఎన్డీడీబీ కాఫ్ 2024 జూలై 16, 23 తేదీల్లో ఇచ్చిన నివేదికల్లో చెప్పినట్లు సిట్ ఛార్జిషీట్ లో పేర్కొందని ఇందులో తెలిపారు.

గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సీబీఐ-సిట్ (CBI-SIT), తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై దర్యాప్తు జరిపి నెల్లూరు అవినీతి నిరోధక శాఖ (ACB) కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో నెయ్యి కల్తీ విషయంపై విస్పష్టమైన ఆధారాలను ఉటంకించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సూచన మేరకు జరిపిన… pic.twitter.com/bFVMZoxo2q
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) February 4, 2026
అలాగే లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందని, కల్తీ జరిగిన సుమారు 20 కోట్ల లడ్డూలను భక్తులకు పంపిణీ చేశారని, అక్రమ లావాదేవీలు జరిగాయని, పత్రాలను ఫోర్జరీ చేశారని.. ఇలా పలు నేరాలపై 36 మందిపై సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ లో తెలిపింది. కాబట్టి నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదు అంటూ నివేదికలు వచ్చాయి అనడం పూర్తిగా అవాస్తవమని నిర్ధారించింది. ఇప్పటికే సిట్ రిపోర్ట్ పై అనుమానాలు ఉన్నాయంటూ ప్రభుత్వం ప్రత్యేకంగా విచారణ కమిషన్ ను నియమిస్తామని ప్రకటించింది. ఇవాళ కూటమి నేతల భేటీ తర్వాత దీనిపై ఓ ప్రకటన కూడా రాబోతోంది. ఇలాంటి సమయంలో ఫ్యాక్ట్ చెక్ ద్వారా కల్తీని నిర్దారిస్తూ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
-
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు












Click it and Unblock the Notifications