వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడ్డుకున్నా సరే: రిషికేశ్వరి మృతిపై జగన్ పార్టీ నిజ నిర్ధారణ

By Pratap
|
Google Oneindia TeluguNews

గుంటూరు: రిషికేశ్వరి ఘటనపై నిజానిజాలను వెలికి తీయడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలోని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలోని నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు సోమవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. కమిటీ సభ్యులను లోనికి రానీయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి.

రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనలో ప్రధాన కారకులను రాజకీయ శక్తులు కాపాడుతున్నట్లు నిజనిర్ధారణ కమిటీ తేల్చింది. ర్యాగింగ్ విషయంలో యాజమాన్యం వివక్షాపూరితంగా వ్యవహరించడం వల్లనే రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకుందని వారు తేల్చారు.

Fact Finding Committee of YSRCP on Rishikeswari death

తప్పుడు పనులు చేసిన ప్రిన్సిపాల్ సహా మరికొందరిని కొన్ని రాజకీయ శక్తులు కాపాడుతున్నట్లు అర్థమైందని కమిటీ సభ్యులు అన్నారు. ఘటనపై ప్రశ్నించినందుకే డేవిడ్ రాజును ఉద్యోగం నుంచి తొలగించారని, దళితుడైనందుకే ఆయనపై కక్ష కట్టారని కమిటీ అభిప్రాయపడింది.

నాగార్జున విశ్వవిద్యాలయంలో కులాల కుంపట్లు కొనసాగుతుండడం దారుణమని కమిటీ సభ్యులు అన్నారు. రిషికేశ్వరి ఘటనపై సిబిఐ చేత విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.

English summary
Fact Finding Committee of YSR Congress alleged that political forces are protecting the culprits in Rishikeswari suicide incident occurred in Acharaya Nagarjuna University.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X