రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కత్తులతో దాడి, భార్యను హతమార్చిన భర్త
అమరావతి: వైఎస్సార్ కడప జిల్లాలో ఫ్యాక్షన్ పడగవిప్పింది. పట్టణంలోని చిన్న చౌక్ వద్ద గురువారం ఉదయం ఓ వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడికి తెగబడ్డారు. వివరాల్లోకి వెళితే, స్థానికంగా నివాసముంటున్న బండి మునిరెడ్డి(35) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
గత కొంతకాలంగా పట్టణంలోని ఒక స్థలానికి సంబంధించి వైసీపీకి చెందిన కార్పోరేటర్ రాజగోపాల్ రెడ్డికి, మునిరెడ్డికి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ఉదయం రోడ్డుపై టీ తాగుతున్న మునిరెడ్డిని కారులో వచ్చిన పదిమంది గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా కత్తులతో దాడి చేశారు.
దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి అతనిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ కలహాలు: భార్యను హతమార్చిన భర్త
చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని సంగవేలు సారథి కాలనీలో కుటుంబ కలహాలతో భార్యను భర్త అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ సంఘటన కాలనీలో సంచలనం సృష్టించింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications