నకిలీ కరెన్సీ ముఠాలో లవర్స్: దాడి చేసి పట్టివేత

స్థానికులు పరిశీలించి చూడగా 1000 రూపాయల దొంగనోట్లు నాలుగు ఒకే నెంబర్‌తో ఉండటంతో గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో అతను చాకచక్యంగా తప్పించుకుని పారిపోయాడు. ఈ విషయంపై గ్రామస్థులు గంగవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది పలమనేరు డిఎస్‌పి హరినాథ్‌రెడ్డి ఎస్‌పి జి శ్రీనివాస్‌కు తెలియజేశారు. దీంతో ప్రత్యేక బృందాలను ఎస్‌పి రంగంలోకి దించారు. గంగవరం సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ విచారణ బృందం దొంగనోట్ల ముఠాను పట్టుకుంది.
బి మురళి (35), అతని ప్రియురాలు టి అంజలి (32), గంగవరం విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆమె మేనకోడలు టి దీపశిఖ (28), గంగవరం మండలం మామడుగులో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆమె ప్రియుడు టి హరి (34), కర్ణాటక రాష్ట్రం ముల్‌బాగల్ తాలూకా కప్పలమడుగు గ్రామానికి చెందిన కె బాబు (34), అదే ప్రాంతానికి చెందిన కూల్‌డ్రింక్ షాపు యజమాని బిసి విశ్వనాథ్ (35), అదే ప్రాంతంలో జిరాక్స్ షాపు నడుపుతున్న జి శంకర్ (32)లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 5లక్షల 24వేల, 500 రూపాయల నకిలీనోట్లను, కలర్ జిరాక్స్ ప్రింటర్, ఒక పేపర్ కట్టలను, రెండు సెల్‌ఫోన్లు, ఐదు సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపుతున్నట్లు ఎస్‌పి తెలిపారు.
ఈ ఎనిమిది మంది ముఠా సభ్యులు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చేతబడి, బాణామతి, క్షుద్రపూజలు, రైన్ పుల్లింగ్, వ్యభిచారం, దొంగనోట్ల చెలామణి వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారని ఎస్‌పి తెలిపారు.
అనంతపురం జిల్లాలో మరో ముఠా అరెస్టు
దొంగనోట్లు ముద్రించి చెలామణి చేస్తున్న 11 మంది సభ్యుల ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.5.4 లక్షల అసలు నోట్లు, రూ.1.67 లక్షల దొంగనోట్లు, టాటాసుమో, రెండు ద్విచక్ర వాహనాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉరవకొండ మండలం బూదగవి గ్రామంలోని మారెమ్మ దేవాలయం వద్ద పోలీసులను చూసి వారు తప్పించుకుని పారిపోగా వెంబడించి పట్టుకున్నారు.
అనంతపురం జిల్లా కణేకల్లుకు చెందిన రాజ్‌కుమార్, వన్నారెడ్డి అనంతపురం నగరంలోని ఓ ఇంట్లో దొంగనోట్లు ముద్రిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. వీరికి కర్నూలుకు చెందిన శ్రీనివాసులు, మాజీ కానిస్టేబుల్ తిరుపతయ్య, ఇంజినీరింగ్ విద్యార్థి ఖాసీం, చంద్రశేఖర్, కృష్ణ, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన అల్లాబకాష్, తాడిపత్రికి చెందిన నరేంద్ర, కర్నాటకకు చెందిన తిప్పయ్య, మంజునాథ్ సహకరించేవారు. వీరంతా ముఠాగా ఏర్పడి దొంగనోట్లు ముద్రించి అటు కర్నాటక, ఆటు ఆంధ్రప్రదేశ్‌లో చెలామణి చేసినట్లు విచారణలో బయటపడింది.












Click it and Unblock the Notifications