విషాదం: పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య

Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: నగరంలోని అరిలోవ ముస్తఫా కాలనీలో గురువారం విషాదం చేటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను రాజేశ్, సౌమ్య, విష్ణు, జాహ్నవిగా గుర్తించారు. వీరంతా ప్రకాశం జిల్లా కనిగిరి వాసులు.

నెలరోజుల క్రితం ప్రకాశం నుంచి విశాఖకు వచ్చిన దంపతులు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం సాయంత్రం మొదట పిల్లలిద్దరికీ విషం ఇచ్చి అనంతరం దంపతులిద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

 A family committed suicide in Visakhapatnam

అయితే వీరు నివాసముండే ప్రాంతంలో, విశాఖలో మృతులకు తెల్సిన వారెవ్వరూ లేరని తెలుస్తోంది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. అసలేం జరిగింది? ఇంత దారుణానికి పాల్పడటానికి గల కారణాలేంటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A family committed suicide in Visakhapatnam on Thursday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి