బిడ్డతో కాల్వలోకి మహిళ, ఉద్యోగాల పేరిట టోకరా

విశాఖపట్నం: ఎన్‌ఏడీ గణేష్ నగర్‌లో ఓ ఇంటిలో ఊపిరి ఆడగక దంపతులు మృతి చెందారు. హుధుద్ తుపాన్‌ వల్ల విశాఖలో విద్యుత్‌ నిలిచిపోయిన విషయం తెలిసిందే. సహాయక చర్యల్లో భాగంగా కొన్ని ప్రాంతాలకు అధికారులు విద్యుత్‌ సరఫరా చేశారు. గణేష్ నగర్‌లో కరెంట్‌ లేకపోవడంతో మంగళవారం రాత్రి ఒక కుటుంబం జనరేటర్‌ వేసుకుని పడుకున్నారు.

ఉదయం చూసేసరికి దంపతులు మృతి చెంది ఉన్నారు. జనరేటర్‌ నుంచి వచ్చిన పొగ గది అంతా వ్యాపించడంతో ఊపిరి ఆడక మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Family dead in Vishaka

ఉద్యోగాల పేరిట రూ.1.5 కోట్లు టోకరా

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. నిరుద్యోగుల నుండి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి చివరకు జైలుకెళ్లాడు. చిత్తురు జిల్లా తిరుపతిలో బాలకృష్ణ అనే వ్యక్తి స్విమ్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఎర వేశాడు.

వందమంది నుండి 1.5 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. వారికి ఉద్యోగాలు ఇప్పించినట్లు నమ్మబలికి నియామక పత్రాలు, ఐడెంటిటీ కార్డులు సైతం అందజేశాడు. నిరుద్యోగులు నిజమేననుకొని మూడు నెలలుగా స్విమ్స్ చుట్టు తిరిగారు. తాము మోసమోయామని ఆలస్యంగా తెలుసుకున్నాక బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలిపిరి పోలీసులు బాలకృష్ణను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

చెట్లు కొమ్మలు తొలగిస్తుండగా బయటపడిన మృతదేహాలు

హుధుద్ తుపాన్‌కు మరో ముగ్గురు బలైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాడేరు మండలం, దేవాపురం పంచాయితీలో ముగ్గురు గిరిజనులు చెట్లు పడి మృతి చెందారు. పాడేరుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి తుపాన్‌ వల్ల రహదారి సౌకర్యం నిలిచిపోయింది. ఆ ప్రాంతంలో సహాయకార్యక్రమాలు చేస్తుండగా కూలిన భారీ వృక్షాలను తొలగిస్తుండగా ముగ్గిరి గిరిజనుల మృత దేహాలు బయటపడ్డాయి.

పసిబిడ్డలతో సహా కేసీ కెనాల్లో దూకి మహిళ ఆత్మహత్య

పసిబిడ్డతో సహా కేసీ కాలువలోకి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలు నగరంలోని కేవీఆర్ మహిళా కళాశాల వద్ద జరిగింది. కేసీ కాలువలో నీటి ప్రవాహం భారీగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+