ప్రేమ వ్యవహారం...ప్రాణం తీసింది:సినీ ఫక్కీలో యువకుడి దారుణ హత్య

చిత్తూరు:ఓ అమ్మాయితో యువకుడి ప్రేమ వ్యవహారం చివరకు అతని దారుణ హత్యకు దారి తీసింది. వారం రోజుల కిందట తలకోన అటవీ ప్రాంతంలో సంచలనం సృష్టించిన యువకుడి మర్ఢర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు.

హంతకులను పట్టుకునేందుకు పోలీసులు చేసిన కృషి ఫలించింది. చివరకు ఈ దారుణానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా వీరిలో ఇద్దరు మహిళలు కావడం గమనార్హం. తన కుమార్తెతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడన్న కోపంతో ఆమె తల్లి ఈ హత్యకు సిద్దపడగా...సినీ ఫక్కీలో నిందితులు ఈ మర్డర్ చేసిన విధానం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఇమ్రాన్ అనే యువకుడి హత్యోదంతం కలకలం రేపింది.

 అమ్మాయితో పరిచయం...ప్రేమ

అమ్మాయితో పరిచయం...ప్రేమ

పీలేరు రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు ఈ మర్డర్ మిస్టరీ వివరాలు వెల్లడించారు. రొంపిచెర్లకు చెందిన ఇమ్రాన్‌(20) అనే యువకుడికి స్థానిక లక్ష్మీనగర్‌కాలనీకి చెందిన అయేషా అనే మహిళ కూతురితో 3 నెలల క్రితం పరిచయమైంది. దీంతో వీరిద్దరూ తరచూ కలవడం మొదలుపెట్టారు. ఆనోటా ఈనోటా ఈ విషయం తెలిసిన అమ్మాయి తల్లి అయేషా, అన్న టిప్పుసుల్తాన్‌ పలుమార్లు ఇమ్రాన్‌ను హెచ్చరించారు. అయినా అతడు ప్రేమికురాలని కలవడం మానలేదు.

తల్లి ఆందోళన...కూతురుతో మరో చోటికి...

తల్లి ఆందోళన...కూతురుతో మరో చోటికి...

దీంతో తన బిడ్డ జీవితం పాడవుతుందని భావించిన అయేషా తన కుమార్తెను అనంతపురం జిల్లా కదిరిలో ఉండే తన తల్లితండ్రుల వద్దకు తీసుకుని వెళ్లిపోయింది. తాను ఇటుకల బట్టీలో పనిచేస్తూ కుమార్తెను అక్కడే ఉంచి చదివిస్తోంది. అయితే ఈ విషయం ఎలాగో తెలుసుకున్న ఇమ్రాన్ మళ్లీ తన ప్రేమికురాలి ఫోన్ నంబర్ సంపాదించి ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. దీంతో ఈ విషయం తెలిసిన ప్రేమికురాలి తల్లి అయేషా...ఇక ఈ ఇమ్రాన్‌ తన కూతురిని వదిలేలా లేడని భావించి అతన్నిచంపితేనే తన కూతురును అతడి బారినుంచి కాపాడుకోగలనని భావించింది.

హత్యకు పథకం...పెద్ద స్కెచ్చే...

హత్యకు పథకం...పెద్ద స్కెచ్చే...

దీంతో ఈ విషయం తన చెల్లెలు అస్మా, కొడుకు టిప్పుసుల్తాన్‌, మరిది భావాజాన్‌లతో చెప్పగా...అతణ్ని చంపడానికి అందరూ కలసి పథకం రచించారు.
అందుకోసం బట్టీలో తమతో పాటు కూలీ పనులు చేసే మస్తాన్‌ అనే వ్యక్తికి తమకు సిమ్ కావాలని అడ్రస్ ఫ్రూప్ తమకు లేనందున నీదివ్వాలంటూ అడిగి అలా అతడి పేరు మీద ఒక సిమ్‌ కార్డు తీసుకున్నారు. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం అయేషా చెల్లెలు అస్మా ఇమ్రాన్ కు ఫోన్ చేసి తాను మదనపల్లెకు చెందిన అమ్మాయిగా ఇమ్రాన్‌ను పరిచయం చేసుకుంది. అలా అతడిని ఒక రహస్య ప్రాంతానికి రప్పించి చంపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆస్మా...ఇమ్రాన్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ ప్రేమించినట్లు నటించి అతడిని హార్సిలీహిల్స్ రావాలని కోరింది. అయితే అతడు అంతదూరం రావడం సాధ్యపడదనడంతో మార్చి 15న తాను తన స్నేహితులతో కలిసి తలకోనకు వస్తున్నానని అక్కడకు వచ్చి ప్పుడు కలుద్దామని ఆమె చెప్పగా అతను సరేనన్నాడు. ఇమ్రాన్‌ ఒప్పుకోవడంతో అస్మా, అయేషా రొంపిచెర్లలో ఉంటున్న కొడుకు టిప్పు సుల్తాన్‌ ఇంటికి ఈ నెల 14న వచ్చి భావాజాన్‌తో కలిసి హత్యకు పథకం వేశారు.

సినీ ఫక్కీలో...పక్కాగా అమలు

సినీ ఫక్కీలో...పక్కాగా అమలు

మార్చి 15న హత్య చేసేందుకు కత్తి, కారంపొడి, చేతికి, కాళ్లకు గ్లౌజులు, హెల్మెట్‌ సిద్ధం చేసుకుని రెండు మోటారు సైకిళ్లతో యర్రావారిపాలెంకు చేరుకున్నారు. అక్కడే ఓ మోటరు సైకిల్‌ను వదిలేసి ఎవరూ లేని ప్రదేశంలో టిప్పుసుల్తాన్‌ చేతికి, కాళ్లకు గ్లౌజులు వేసుకుని ఆడవారిలా బుర్ఖా ధరించి పిన్ని అస్మా, అయేషాతో కలిసి ఆటోను బాడుగకు తీసుకుని తలకోనకి బయలుదేరారు. మరో మోటరుసైకిల్‌పై ముందుగానే భావాజాన్‌ తలకోనకు చేరుకున్నాడు. దారిమధ్యలో కూల్ డ్రింక్ తీసుకుని అందులో నిద్రమాత్రలు కలిపారు. అనంతరం ఇమ్రాన్‌ను ఓ చోట ఆటోలో ఎక్కించుకున్నారు. అస్మా...బుర్ఖాలో ఉన్నవారు తన స్నేహితులని ఇమ్రాన్‌ను నమ్మించింది.

చంపేశారు...మర్డర్ మిస్టరీ చేధించిన పోలీసులు...

చంపేశారు...మర్డర్ మిస్టరీ చేధించిన పోలీసులు...

ఆ తర్వాత అతన్నిమాటల్లోకి దింపి ఆ కూల్ డ్రింక్ తాగించారు. తలకోన ప్రాంతంలో అటవీ శాఖ గెస్ట్ హౌస్ వద్ద ఇద్దరినీ అక్కడే ఉండమని చెప్పి అస్మా, ఇమ్రాన్‌తో కలిసి అడవి లోపలికి వెళ్లింది. లోపలికి వెళ్లాక మత్తులోకి జారుకున్న ఇమ్రాన్‌ కళ్లలో అస్మా కారం చల్లి కింద పడేసింది. వెంటనే టిప్పుసుల్తాన్‌, అయేషా అక్కడికి చేరుకున్నారు. ఇమ్రాన్‌ కాళ్లను అస్మా గట్టిగా పట్టుకోగా చేతులను, తలను టిప్పుసుల్తాన్‌ పట్టుకున్నాడు. ఆ తర్వాత అయేషా...ఇమ్రాన్‌ రొమ్ముపై కూచుని అతని గొంతు కోసింది.దీంతో అక్కడికక్కడే ఇమ్రాన్‌ మృతి చెందాడు. మరోవైపు ఈ హత్య చేసేటప్పుడు ఎవరైనా వస్తుంటే చూసేందుకు భావజాన్‌ను ఫారెస్ట్‌ గేట్‌ వద్ద కాపలా ఉంచారు. ఇలా ఇమ్రాన్ ను దారుణంగా హత్య చేశాక వీరంతా రొంపిచెర్లకు వచ్చిహత్యకు ఉపయోగించిన వస్తువులను భావాజాన్‌ ఇంటి అల్మారాలో పెట్టారు. అయితే హత్య విషయం బైటపడ్డాక పోలీసుల జాగిలాలు వాసన పసిగడతాయని భావించి కొండారెడ్డిగారిపల్లి గ్రామంలో చెక్‌డ్యాం వద్ద వాటిని తగులబెట్టారు. అడవి ప్రాంతలో మృతదేహన్ని ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసరు జ్యోత్స్నగుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసును పోలీసులు ఛాలెంజ్ గా తీసుకుని హతుడు వాడిన సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా మర్డర్ మిస్టరీ ఛేదించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+