విజయవాడలో ఫేమస్ కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ సీజ్ .. ఎందుకంటే
కాకినాడ సుబ్బయ్య హోటల్ అంటే తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్కరికి తెలిసిన ఫేమస్ హోటల్ .అటువంటి కాకినాడ సుబ్బయ్య హోటల్ ఒక్క కాకినాడలో మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక నగరాలలో బ్రాంచ్ లతో దూసుకుపోతుంది. ఈ హోటల్లో ఫుడ్ చాలా స్పెషల్, ఎంతో టేస్టీగా ఉండే భోజనాన్ని అందించే కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు.
సుబ్బయ్య హోటల్ లో జెర్రి
అదేంటి.. తెలుగు రాష్ట్రాలలో ఇంత ఫేమస్ అయిన కాకినాడ సుబ్బయ్య హోటల్ సీజ్ చేయడం అనుకుంటున్నారా.. అయితే అసలు విషయానికి వద్దాం.. విజయవాడలో ఉన్న కాకినాడ సుబ్బయ్య హోటల్ బ్రాంచ్ లో ఓ కస్టమర్ భోజనం చేయడానికి వచ్చి భోజనాన్ని ఆర్డర్ ఇవ్వగా, అక్కడ సిబ్బంది ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చారు. అయితే ఆ భోజనంలో కాళ్ల జెర్రి ఉంది.

కేంద్ర మానవ హక్కుల కమిషన్ ఇన్చార్జి చైర్మన్ ఆగ్రహం
దీంతో కష్టమర్ ఒక్కసారిగా అవాక్కై హోటల్ సిబ్బందిని పిలిచి భోజనంలో వచ్చిన జెర్రిని చూపించి అసహనం వ్యక్తం చేశాడు.
అయితే అదే సమయంలో ఆ హోటల్లో కేంద్ర మానవ హక్కుల కమిషన్ ఇన్చార్జి చైర్మన్ విజయభారతి సయాని భోజనం చేస్తున్నారు. దీంతో వెంటనే ఆమె స్పందించి సుబ్బయ్య గారి హోటల్ నిర్వాహకుల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హోటల్ సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
ఆపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సుబ్బయ్య గారి హోటల్ ను పరిశీలించి సీజ్ చేశారు. అంతేకాదు సుబ్బయ్య గారి హోటల్లోని ఫుడ్ శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపించారు.
బయట భోజనం చెయ్యాలంటే భయపడుతున్న జనం
ఇటీవల కాలంలో చాలా పెద్ద హోటల్స్ లోను, రెస్టారెంట్స్ లోనూ ఈ విధంగా భోజనంలో పురుగులు రావడం ప్రధానంగా కనిపిస్తుంది. పాడైపోయిన ఆహార పదార్థాలను పెట్టడం, నాసిరకమైన వస్తువులను ఉపయోగించడం, వంటశాలలు అపరిశుభ్రంగా ఉంచుకోవడం అంటే అనేక ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇక ఈ ఘటనలతో బయటకు వెళ్లి భోజనం చేయాలంటే జనం భయపడుతున్న పరిస్థితి ఉంది ఎక్కడ ఏం తింటే ఏం జరుగుతుందో అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications