ఖమ్మం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఓ అభిమాని సైకిల్ యాత్ర చేపట్టారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పవర్ స్టార్ అభిమాని ఈ యాత్ర చేపట్టారు.
జిల్లాకు చెందిన మాచినేనిపేటతండాకు చెందిన లకావత్ రమేష్.. పవన్ కళ్యాణ్‌కు అభిమాని. ఆయన గురువారం రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం సైకిల్ పైన బయలుదేరారు. తన గ్రామం నుంచి హైదరాబాదులోని పార్టీ కార్యాలయం వరకు ఆయన సైకిల్ పైన పాదయాత్ర చేస్తున్నారు. తాను హైదరాబాదులోని కార్యాలయంలో పవన్ కళ్యాణ్‍ను కలుస్తానని చెప్పారు.

రాజకీయాల కోసం సినిమాలు పక్కకు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా ఇటీవలే పూర్తయింది. ఆయన త్వరలో రాజకీయ రణరంగంలోకి దిగనున్నారు. 2014లో పార్టీ స్థాపించిన పవన్ చాలా రోజుల తర్వాత జనసేనపై దృష్టి పెట్టనున్నారు. ఇందుకోసం సినిమాలను కూడా ఆయన పక్కన పెట్టనున్న విషయం తెలిసిందే. ఐదు రోజుల క్రితం జనసేన సభ్యత్వ నమోదు కూడా ప్రారంభమైంది.

ముఖ్యంగా ఏపీపై దృష్టి
పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి సారించనున్న నేపథ్యంలో ఆయన ఇప్పటికే పలువురు ముఖ్యులతో భేటీ అవుతున్నారు. పార్టీని బలోపేతం చేసే విషయమై అంతర్గతంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో జనసేన బలోపేతంపై ఆయన దృష్టి పెట్టారని తెలుస్తోంది.

అవసరమైతే గట్టి కౌంటర్‌కు సిద్ధం
ఓ వైపు పవన్ కళ్యాణ్ వస్తున్నందున మరోవైపు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీలు అప్రమత్తమవుతున్నాయి. ఆయన పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టాక విమర్శలు చేస్తే సరైన కౌంటర్ ఇచ్చేందుకు ఇతర పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇన్నాళ్లు ఆయన విమర్శలపై సానుకూలంగా స్పందించిన టీడీపీ, బీజేపీలు కూడా అవసరమైతే గట్టిగా మాట్లాడేందుకు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది.


కేసీఆర్‌తో భేటీకి ప్రాధాన్యత
కాగా, ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో తెలంగాణలో ఆయన పెద్దగా దృష్టి పెట్టకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారిద్దరు పరస్పరం అవగాహనతో ఉన్నారా అనే చర్చ సాగుతోంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Subscribe to Telugu Oneindia.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!