వైసీపీ చేతికి రేవంత్ అస్త్రం - టార్గెట్ షర్మిల, ఫ్యాన్స్ సీరియస్..!!
ఏపీలో రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ దివంగత సీఎం వైఎస్సార్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎన్నికల సమయంలో వైఎస్సార్ కు దండలు వేసి..ఆయన గురించి రేవంత్ తాజాగా చేసిన వ్యాఖ్యల పై వైఎస్సార్ అభిమానులు మండిపడుతున్నారు. దీని పైన స్పందించాలని షర్మిలతో పాటుగా తెలంగాణ మంత్రులను డిమాండ్ చేస్తున్నారు.
రేవంత్ వ్యాఖ్యల కలకలం : తెలంగాణ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్సార్ పైన సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఒక టీవీ ఛానల్ లో చర్చలో పాల్గొన్న రేవంత్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల పైన వ్యాఖ్యల్లో భాగంగా వైఎస్సార్ ప్రస్తావన వచ్చింది. నాడు 2009 ఎన్నికల్లో వైఎస్సార్ గెలిచిన సీట్ల గురించి ప్రస్తావించారు. వైఎస్సార్ మరణం ముందు టీడీపీ, టీఆర్ఎస్ నుంచి కొంత మందిని కాంగ్రెస్ లోకి తీసుకోవటానికి ప్రయత్నాలు చేసారని ఇంటర్వ్యూ నిర్వాహకులు గుర్తు చేసారు. దీనికి స్పందించిన రేవంత్ అవును ప్రయత్నం చేసారు, కానీ ప్రకృతి ఒప్పుకోదు..రకరకాల పరిణామాలకు దారి తీస్తుంది కదా అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పైన వైఎస్సార్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

వైఎస్సార్ ఫ్యాన్స్ ఆగ్రహం : రేవంత్ వ్యాఖ్యలను జత చేస్తూ షర్మిలతో పాటుగా, వైఎస్సార్ ప్రోత్సాహంతో ఎదిగి నేడు తెలంగాణ మంత్రులుగా ఉన్న వారిని ట్యాగ్ చేస్తూ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలక్షన్స్ ముందు వరకు విగ్రహాలకు దండలేసి పొర్లు దండాలు పెట్టి..గెలిచాక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ నిలదీస్తున్నారు. వైఎస్సార్ వారసురాలిగా తెలంగాణలో రాజకీయంగా ఒక ఇన్నింగ్స్ పూర్తి చేసిన షర్మిల ఇప్పుడు ఏపీలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. వైఎస్సార్ ను సైతం ఇప్పుడు 14 ఏళ్ల తరువాత గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ నేతలు ఏపీలో రాజకీయాల పైన స్పందిస్తున్నారు. ఇదే సమయంలో రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలతో షర్మిల ఇరకాటంలో పడినట్లు స్పష్టం అవుతోంది.
ఎలక్షన్స్ ముందు వరకు విగ్రహాలకు దండలేసి పొర్లు దండాలు పెట్టి
— Vikas #JaganAgainIn2024🇱🇸 (@Fan_Of_JaGUN) January 7, 2024
ఎలక్షన్స్ గెలిచాక రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని ఇంత నీచంగా మాట్లాడటాన్ని మీరు ఖండించి
దాని మీద మాట్లాడాలని రాజశేఖర్ రెడ్డి గారి భక్తులుగా మేమంతా కోరుకుంటున్నాం అన్న 🙏@Bhatti_Mallu @KomatireddyKVR @realyssharmila… pic.twitter.com/M3VmAFGsUb
షర్మిల స్పందించాలంటూ : రేవంత్ ఏపీలో కాంగ్రెస్ కు అండగా నిలుస్తానని చెప్పుకొచ్చారు. షర్మిలకు సాయంగా ఉంటామని చెప్పారు. అదే సమయంలో తాను సీఎం అయిన తరువాత జగన్ ఫోన్ చేసి అభినందనలు చెప్పలేదని రేవంత్ వ్యాఖ్యానించారు. రేవంత్ ప్రమాణ స్వీకారం రోజున సీఎం జగన్ అభినందిస్తూ చేసిన ట్వీట్..స్పందనగా రేవంత్ ధన్యవాదాలు చెబుతూ పోస్ట్ చేసిన ట్వీట్ ను అభిమానులు గుర్తు చేస్తున్నారు. వైఎస్సార్ తనయగా ఏపీ రాజకీయాల్లో షర్మిల యాక్టివ్ కావాలని భావిస్తున్నారు. ఈ సమయంలో రేవంత్ చేసిన కామెంట్స్ ను వైసీపీ, వైఎస్సార్ అభిమానులు సీరియస్ గా తీసుకున్నారు. కాంగ్రెస్ లో చేరిన షర్మిల ఆ పార్టీ సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications