ఫ్యాన్స్ మేళా: బెజవాడ నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తారా?
విజయవాడ: వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేయాలని ఆయన అభిమానులు విజ్ఞప్తి చేశారు. తాను పూర్తి స్థాయిలో రాజకీయాల్లో పాల్గొంటానని పవన్ కల్యాణ్ చెప్పిన నేపథ్యంలో ఆయన అభిమానులు ఆ డిమాండ్‌ను ముందుకు తెచ్చారు.
ప్రెస్‌క్లబ్బులో సమావేశమైన పవన్ కల్యాణ్ అబిమానులు విజయవాడలోని ప్రెస్ క్లుబ్బులో మధ్యాహ్న భోజనానికి రావాల్సిందిగా పవన్ కల్యాణ్ కోరుకు్ంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని, కనీసం కేంద్రం నుంచి నిధులు కూడా రావడం లేదని వారన్నారు.
ఆ విషయాలపై పవన్ కల్యాణ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా పార్టీిని బలోపేతం చేసి పూర్తి స్థాయిలో జనసేనను తీర్చిదిద్దాలని వారు కోరారు. అభిమానుల కోరికను పవన్ కల్యాణ్ ఏ మేరకు తీరుస్తారనేది వేచి చూడాల్సిందే.

వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఏ మేరకు అభ్యర్థులను నిలబెడుతారు, ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటారా వంటి ప్రశ్నలకు ఇంకా సమాధానాలు రావాల్సే ఉంది. సొంతంగానే పోటీ చేస్తానని ఆయన ప్రకటించినప్పటికీ పార్టీ నిర్మాణమే లేనప్పుడు అంత సాహసం చేయగలరా అనేది కూడా చూడాల్సిందే.
తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, బిజెపి, కాంగ్రెసు పార్టీలకు దీటుగా ఆయన పార్టీ యంత్రాంగాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నిర్మాణం ఎలా జరుగుతుందనేది ఇంకా తేలడం లేదు.












Click it and Unblock the Notifications