సన్ రైజర్స్‌కు ఏపీ ఆహ్వానం.. హైదరాబాద్‌కు కావ్య మారన్ గుడ్ బై..?
ఐపీఎల్ 2025 సీజన్ జరుగుతున్న క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్,హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య దూరం పెరుగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ , హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య టికెట్ల వివాదం తీవ్రతరమైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనుచితంగా ప్రవర్తించిందని, బెదిరింపులకు పాల్పడిందని SRH యాజమాన్యం ఆరోపించింది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే, హైదరాబాద్‌ను వదిలి వెళ్లిపోతామని హెచ్చరించింది. SRH ఆరోపణలను HCA ఖండించింది.ఉచిత పాస్‌ల విషయంలో (IPL 2025) సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య గొడవలు పతాకస్థాయికి చేరాయి. పాస్‌ల కోసం HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు తీవ్రంగా వేధిస్తున్నాడని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ సంచలన ఆరోపణలు చేసింది.
ఇలా చేస్తే హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామని బెదిరించింది. ఈ అంశానికి సంబంధించి సన్‌రైజర్స్ జనరల్ మేనేజర్ టిబి శ్రీనాథ్ హెచ్‌సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్ రావు ఓ ఘాటు లేఖ రాశారు. ఉచిత పాస్‌ల కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు ఏ జగన్‌మోహన్ రావు వేధింపులు తీవ్రమయ్యాయి. ఇలాంటి ప్రవర్తనను మేము ఏమాత్రం సహించం అని SRH యాజమాన్యం తెలిపింది. గత రెండు సీజన్లుగా HCA తమ సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని, ఈ విషయాన్ని HCA దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి పరిష్కారం రాలేదని SRH తెలిపింది.
HCA ప్రవర్తన చూస్తుంటే, ఈ స్టేడియంలో SRH ఆడేలా చూడకూడదనే ఉద్దేశంతో ఉన్నట్లుగా అనిపిస్తోంది.

ఇదే నిజమైతే, BCCI, తెలంగాణ ప్రభుత్వం, మా యాజమాన్యంతో చర్చించి, హైదరాబాద్‌ను వదిలి, కొత్త వేదికను చూస్తామని SRH జనరల్ మేనేజర్ (స్పోర్ట్స్) శ్రీనాథ్ హెచ్చరించారు. గత 12 సంవత్సరాలుగా HCAతో కలిసి పనిచేస్తున్నాము. గత సీజన్ నుండి మాత్రమే ఈ సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నాము. ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారికి ప్రతి సీజన్‌లో 50 కాంప్లిమెంటరీ టికెట్లు (F12A బాక్స్) ఇస్తున్నామని SRH జనరల్ మేనేజర్ (స్పోర్ట్స్) శ్రీనాథ్ తమ ప్రకటనలో తెలిపారు.సన్‌రైజర్స్ టీం హైదరాబాద్ నుంచి వెళ్లిపోతుందనే వార్త బయటకు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాన్ని హెచ్‌సీఏ బెదిరిస్తోందని వస్తోన్న వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు.
దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ డైరెక్టర్ జనరల్ కె శ్రీనివాస్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్రికెట్ మ్యాచ్‌లకు పాస్‌లు డిమాండ్ చేస్తూ SRH యాజమాన్యానికి ఎవరైనా సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇదిలా ఉంటే సన్‌రైజర్స్ టీం హైదరాబాద్ నుంచి తరలిపోతుందని వస్తోన్న వార్తలపై ఏపీ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. సన్‌రైజర్స్ టీంను ఏపీకి రావాలని ఫ్యాన్స్ ఆహ్వానం పలుకుతున్నారు.ఏపీకి ప్రత్యేకంగా టీం లేకపోవడంతో , ఇన్నాళ్లు సన్‌రైజర్స్ టీంనే తమ సొంత టీంగా భావిస్తున్నారు.ఇప్పుడు హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ ఇబ్బందులు ఎదురు కావడంతో , ఆ జట్టును ఏపీకి రావాలని అభిమానులు స్వాగతం పలుకుతున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications