చంద్రబాబుకు రూ. 50 కోట్ల విలువైన పురాతన విగ్రహం అందజేత
విజయవాడ: కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలోని గుడిమెట్ల అనే ఊరిలో పురాతన కాలం నాటి పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం ఒకటి బయటపడింది. ఈనెల 12వ తేదీన రైతు భాస్కరరావు తన వ్యవసాయక్షేత్రంలో పొలం దున్నతుండగా ఈ పంచలోహ విగ్రహం బయట పడింది.
దీని విలువ మార్కెట్‌లో రూ.50 కోట్లు ఉంటుందని పురావస్తుశాఖ అంచనా వేసింది. శుక్రవారం అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో ఆయన్ని కలిసి ఈ విగ్రహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు ఉదయభాస్కర్‌ను అభినందించారు.

ఈ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం బంగారు తాపడంతో ఉండటం విశేషం. ఈ విగ్రహం దొరికిన చోటే ఆలయం నిర్మిద్దామని అతనికి చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. విగ్రహాం చంద్రబాబుకు అందజేసే సమయంలో రైతు వెంట అతని కుటుంబ సభ్యులు, విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications