కాంగ్రెస్‌కు గుడ్‌బై... బీజేపీలో చేరిన ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు బుధవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని భారతీయ జనాతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు. బీజేపీ కండూవా వేసి అమిత్ షా ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు.

కంతేటి నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీకి తన సేవలనందించారు. కాంగ్రెస్ పార్టీ తరుపున అనేత అత్యున్నత పదవుల్లో పని చేశారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడుగా కూడా పనిచేసిన కంతేటి సత్యనారాయణ రాజు ఇంత సడన్‌గా పార్టీ మారడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
గత ఏడాది ఆయనకు కాంగ్రెస్ హై కమాండ్ ఎమ్మెల్సీ పదవిని గవర్నర్ కోటాలో కేటాయించింది. అయితే ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఆయనకు ఎలాంటి పదవి దక్కుతుందనే విషయం తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications