ఎపి రాజధానికి చిక్కులు: హైకోర్టుకెక్కిన రైతులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూసేకరణ విషయంలో చిక్కులు ఎదురయ్యేట్లే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానికి ల్యాండ్ పూలింగ్‌ను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు ఆ పిటిషన్‌నము పరిగణనలోకి తీసుకుని తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
దానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరణను ఇవ్వాలని హైకోర్టు అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించింది. ల్యాండ్ పూలింగ్ నుంచి తమను తప్పించాలని కోరుతూ ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాలకు చెందిన 32 మంది రైతులు కోర్టులో పిటిషన్ వేశారు.

సిఆర్‌డిఎ చట్టంలోని క్లాజ్ 22 సెక్షన్ 2(52) ప్రకారం స్వచ్ఛందంగా భూములు ఇస్తేనే తీసుకోవాలని, బలవంతంగా భూములు లాక్కునే పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని రైతులు తమ పిటిషన్‌లో అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్‌కు తాము వ్యతిరేకమంటూ ఇప్పటికే సిఆర్‌డిఎకు అభ్యంతర ఫారాలు రైతులు ఇచ్చారు. ఆ అభ్యంతర ఫారాలు ఇచ్చిన 15 రోజుల తర్వాత ప్రభుత్వం నుంచి సమాధానం రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించలేదు.
అభ్యంతర ఫారాలు ఇచ్చిన రైతులకు ల్యాండ్ పూలింగ్‌తో సంబంధం లేదంటూ సిఆర్‌డిఎ నిబంధనల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది వరకే పేర్కొంది. అయితే, అభ్యంతర ఫారాలు ఇచ్చిన నెల గడుస్తున్నా ప్రభుత్వం నుంచి సమాధానం లేకపోవడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications