ముచ్చటగా ముగ్గుర్ని పెళ్లాడిన నిత్య పెళ్లికొడుకు

హైదరాబాద్‌: ఓ నిత్య పెళ్లి కొడుకు చివరికి కటకటాల పాలయ్యాడు. మాయ మాటలు చెప్పి ముగ్గురిని పెళ్లాడిన ఓ వ్యక్తిని సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాదులోని పంజాగుట్ట ఎస్సై నాగరాజు గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం - విశాఖపట్నంకు చెందిన గాజువాక వాసి అవినాష్ (25) సికింద్రాబాద్ మెట్టుగూడలో రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న తన తల్లి క్వార్టర్స్‌లో ఉండేవాడు.

2009లో అతనికి వివాహం జరిగింది. ముగ్గురు సంతానం. వృత్తిరీత్యా అమీర్‌పేటలోని ఓ బట్టలదుకాణంలో పనిచేస్తుండే వాడు. ప్రతాప్‌నగర్‌లోని మరో యువతికి మాయ మాటలు చెప్ప సికింద్రాబాద్ లోని ఉప్పుగూడలో రెండో కాపురం పెట్టాడు. స్వగ్రామం గాజువాకలో మరో యువతిని నమ్మించ ఆమెను సైతం ఉప్పుగూడలో మరో ప్రాంతంలో ఉంచాడు.

Farmers challenges land pooling for AP in High court

కొన్ని రోజుల క్రితం పోలీసుస్టేషన్‌లో ప్రతాప్‌నగర్‌కు చెందిన యువతి అన్నయ్య తన చెల్లెలు కన్పించడం లేదని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ యువతికి చెందిన సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా ఉప్పుగూడలో ఆమెతో పాటు అవినాష్‌ను ఉన్నట్లు తెలుసుకున్నారు. కేసు నమోదుచేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

సహారా ఎస్టేట్స్‌లో చోరీలు

హైదరాబాదులోని వనస్థలిపురం సహారా ఎస్టేట్స్‌లోని పది ఇళ్లల్లో వరుస చోరీలు జరిగాయి. ఇళ్లల్లో ఉన్న నగదును, బంగారు, వెండి ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లి పోయారు. ఇండ్లలో ఉన్న సామానులను చెల్లాచెదురుగా పడేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన ఇండ్లను పోలీసులు తనిఖీ చేశారు. చోరీకి పాల్పడిన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+