అమరావతి కేంద్రంగా సంచలన నిర్ణయం, ముహూర్తం ఫిక్స్..!!
అమరావతి రైతులు కీలక డిమాండ్లు తెర మీదకు తెచ్చారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన తమ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులతో సీఆర్డీఏ వరుస భేటీలు నిర్వహిస్తోంది. ఈ సమయంలోనే ఏపీ రాజధానిగా అమరావతిని పార్లమెంట్‌లో చట్టం చేసేలా చూడాలని అమరావతి రాజధాని రైతుల ఐక్య కార్యాచరణ సమితి ప్రభుత్వాన్ని కోరింది. దీని పైన సీఆర్డీఏ ఢిల్లీ కేంద్రంగా తమ ప్రయత్నాలను వివరించింది. డిసెంబర్‌లో అమరావతి బిల్లు పార్లమెంట్ కు వచ్చే అవకాశం ఉందని సూచన ప్రాయంగా అధికారులు వెల్లడించారు.
అమరావతి రైతులు సీఆర్డీఏ ఎదుట కీలక అంశాలను ప్రస్తావించారు. తమకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపులతో పాటుగా హామీల అమలు పైన చర్చించారు. తమ సమస్యలు పట్టించుకోవాలని డిమాండ్ చేసారు. ఇదే సమయంలో అలాగే రాజధానిని గుర్తిస్తూ గెజిట్ ఇచ్చే అంశం ఇంతకాలం ఎందుకు పెండింగ్లో ఉందని రైతులు అడిగారు. దీనికి కమిషనర్ స్పందిస్తూ ఇప్పటి వరకూ దేశంలో ఏ రాజధానికి గెజిట్ లేదని అమరావతికి అవసరం ఏముందని అన్నారు. హైదరాబాద్ నగరానికి కూడా గెజిట్ లేదని చెప్పారు. దీనిపై రైతులు మాట్లాడుతూ విభజన చట్టంలోనే హైదరాబాద్ పది సంవత్సరాలు రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారని, అందువల్లే గెజిట్ అని అడిగామని తెలిపారు. ఇదే అంశంపై తాము కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళితే గెజిట్ ఇచ్చేందుకు అంగీకరించారని, అయితే న్యాయ విభాగం అధికారులు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారని వెల్లడించారు.

కాగా, వాటిని కూడా క్లియర్ చేస్తున్నామని, డిసెంబర్లో జరిగే పార్లమెంటు సమావేశాల్లో అమరావతికి సంబంధించిన బిల్లు పెట్టే అవకాశం ఉందని కమిషనర్ రైతులకు తెలిపారు. గ్రామాల్లో నుండి రోడ్లు వేసేందుకు తీసుకున్న ప్లానులో కొన్నిచోట్ల కొద్దిస్థలాన్ని వదిలేస్తున్నారని తెలిపారు. వాటిని దుకాణాలు నిర్మించుకుని వినియోగించుకునేలా ప్లాను చేస్తున్నామని కమిషనర్ రైతులకు తెలిపారు. ప్రస్తుతం రైతులకు ఇచ్చిన ప్లాట్లకు సంబంధించి సరిహద్దు రాళ్లు కనిపించడం లేదని, ఆందోళనలో ఉన్నారని రైతులు తెలపగా పనులు జరుగుతున్న నేపథ్యంలో పగ్‌మార్కు చూపిస్తామని అక్కడ నుండి డెవలపర్ అభివృద్ధి చేసిన తరువాత రైతులకు ఇచ్చే సమయంలో రాళ్లు వేసి ఇస్తామని కమిషనర్ అన్నారు. ఇప్పుడు సరిహద్దు రాళ్లు పెట్టినా మెరకతోలాల్సి ఉంటుందని, అనంతరం కనిపించకుండా పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో లేఅవుట్లు అభివృద్ధి తరువాత సరిహద్దు రాళ్లను పెట్టి ఇస్తామని కమిషనర్ వివరించారు. దీంతో.. ఎప్పటి లోగా పార్లమెంట్ లో అమరావతికి చట్టబద్దత బిల్లు ఆమోదం పొందుతుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications