ఘోర ప్రమాదం.. లారీ, బస్సు ఢీ, నలుగురు మృతి
చిత్తూరు జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి-చెన్నై రహదారిలో లారీ, బస్సు ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టరాు.
గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది ఇలావుండగా, తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామానికి చెందిన బన్నీ(19), మధు(22), మణిదీప్(21)లు మూడుచింతలపల్లి గ్రామం నుంచి కేశవరం వైపు పల్సర్ బైక్‌పై వెళుతున్నారు.
కేశవరం గ్రామ సమీపంలోని బంగారుగుట్ట మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి కిందడిపోయారు. ఈ ప్రమాద ఘటనలో వల్లపు బన్నీ అక్కడికక్కడే మృతి చెందాడు. మణిదీప్, మధు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణం కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications