పల్నాడులో ఘోర ప్రమాదం: నలుగురు మహిళలు మృతి
పల్నాడు జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముప్పాళ్ల మండలంలోని బొల్లవరం పరిధిలోని మాదల మేజర్ కాలవ కట్టపై ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళా కూలీలు మృతి చెందారు. పలువురు కూలీలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు.
ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మహిళా కూలీలు మిరప కోతలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో నలుగురు మహిళలు మధిర సామ్రాజ్యం (50), మధిర గంగమ్మ (55), చక్కెర మాధవి (30), తేనెపల్లి పద్మావతి (45) అక్కడికక్కడే మృతి చెందారు.

గాయపడిన వారిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు, ఈ ప్రమాద ఘటనపై ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళా కూలీల మృతి బాధాకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఆదేశించారు.
అనకాపల్లిలో విషాదం
అనకాపల్లి జిల్లా తుమ్మలపాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల కుమారుడితో కలిసి ఓ మహిళా హోంగార్డు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న అట్టా ఝాన్సీ.. తన ఆరేళ్ల కుమారుడు దినేశ్ కార్తీక్‌తో కలిసి ఏలూరు కాలువలో దూకారు. భర్త అచ్యుతరావు అలియాస్ విజయ్ వేధింపులు భరించలేక ఆమె తన కుమారుడితో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
ఇది ఇలావుండగా, అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. కొత్తపేట గ్రామానికి చెందని పవన్ తేజ, సూర్య తేజలుగా వారిని గుర్తించారు. సూర్యతేజ మృతదేహం లభ్యం కాగా, పవన్ తేజ కోసం గాలిస్తున్నారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications