కన్న కూతుర్ని కడతేర్చాడు : దళితుడిని ప్రేమించందని..పీక పిసికి చంపేశాడు..!
మిర్యాలగూడ లో జరిగిన ఉదంతం మరిచిపోకముందే ప్రకాశం జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. దళితుడిని ప్రేమించిందన్న కోపంతో కన్నకూతుర్నే గొంతు పిసికి చంపేశాడో కసాయి తండ్రి. ఆపై అనారోగ్యంతో మృతిచెందింద ని నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో తానే హత్య చేశానని అంగీకరించాడు.
దళితుడిని ప్రేమించిందని..
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొత్తపాలెంలో గ్రామానికి చెందిన కోట వెంకటరెడ్డికి ఇద్దరు కుమార్తెలు. రెండో కుమా ర్తె వైష్ణవి (20) ఒంగోలులోని ప్రైవేటు కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. లింగసముద్రంకు చెందిన సహ విద్యార్థి, ఎస్సీ కులస్థుడైన సునీల్‌తో ఆమె పరిచయం ప్రేమగా మారింది. విషయం వైష్ణవి తండ్రికి తెలియడంతో కు మార్తెను మందలించాడు. దీంతో ఆమె గతనెల 31న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తల్లిడండ్రులు కళాశాల యాజమా న్యం సాయంతో సునీల్‌ను గుర్తించి.. అతని ద్వారా ఆమె తిరుపతిలో ఉందని తెలుసుకున్నారు. సునీల్‌తో ఆమెకు ఫోన్ చేయించి ఇంటికి తీసుకొచ్చారు. ఆమె ఈనెల 2న మరోసారి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వైష్ణవి మార్కాపురంలో ఉందని పోలీసుల ద్వారా సమాచారం అందుకొన్న తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకొచ్చి వారించే ప్రయత్నం చేసారు.

గొంతు నులిమి చంపేసిన తండ్రి..
తల్లి తండ్రుల నుండి తప్పించుకొని ఆదివారం అర్ధరాత్రి కూడా ఆమె ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించ గా తండ్రి అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది. దీంతో ఆగ్రహానికి గురైన వెంకటరెడ్డి కుమార్తె గొంతు నులి మి చంపేశాడు. గ్రామస్థులకు తన కుమార్తె నాలుగు రోజులుగా అన్నం తినడం లేదని దీంతో నీరసించి చనిపోయింద ని నమ్మబలికాడు. మాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని వెంకటరెడ్డిని విచారించగా తానే చంపినట్లు అంగీకరించాడు. ఇప్పుడు ఈ ఘటనతో ఒక్క సారిగా జిల్లా ఉలిక్కి పడింది. ప్రేమగా పెంచుకున్న కుమార్తెను తండ్రి దళితుడిని ప్రేమించదనే ఒకే కారణంగా ఇలా ప్రాణాలు తీయటం పై అందరూ ముక్త కంఠం తో ఖండిస్తున్నారు. తం డ్రి ని పోలీసులు అరెస్ట్ చేసారు.












Click it and Unblock the Notifications