దారుణం: చిత్తుగా తాగేసి కన్నకూతురిపై తండ్రి అత్యాచారం
విజయవాడ: ప్రకాశం జిల్లా పంగులూరు మండలం బూదవాడలో అత్యంత నీచమైన సంఘటన చోటు చేసుకుంది. చిత్తుగా మద్యం సేవించి వావివరుసలు మరిచి పదేళ్ల కూతురిపై కన్నతండ్రే అత్యాచారం చేశాడు. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్తు షాక్‌కు ఇద్దరు మృతి
విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలో విద్యుత్‌షాక్‌తో ఇద్దరు మరణించారు. విద్యుత్‌షాక్‌కు గురైన వ్యక్తిని కాపాడిన ఇద్దరు రిటైర్డు ఉద్యోగులు మృత్యువాత పడ్డారు. మరణించిన వారిలో సత్యనారాయణ, బాబురావు ఉన్నారు.

లారీ బోల్తా పడి నలుగురు మహిళలు మృతి
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట దగ్గర గ్రానైట్ లారీ బోల్తా పడి నలుగురు మహిళలు మరణించారు. రాళ్ల మధ్య నలిగి మహిళలు మృతి చెందారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతులు ప్రకాశం జిల్లా మార్టూరు మండలం చినజాగర్లమూడి గ్రామస్థులని పోలీసులు చెప్పారు.
బీచ్‌లో స్నానానికి వెళ్లి విద్యార్థిని మృతి
విజయనగరం జిల్లా కళింగపట్నం బీచ్‌లో స్నానానికి వెళ్లి ఓ విద్యార్తిని మరణించింది. గుమ్మలక్ష్మీపురం మండలం బెంగళ గ్రామానికి చెందిన ధనలక్ష్మి గురువారంనాడు స్నేహితులతో కలిసి కళింగపట్నం బీచ్‌లో స్నానానికి వెళ్లి గల్లంతైంది.
ధనలక్ష్మి స్థానికంగా ఉన్న డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె కోసం గురువారం ఎంతగా గాలించినా ఫలితం కనిపించలేదు. శుక్రవారం ఉదయం ఆమె మృతదేహం కళింగపట్నం తీరానికి కొట్టుకుని వచ్చింది.












Click it and Unblock the Notifications