వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏసీబీకే కళ్లు చెదిరేలా!: ఆ అధికారి వద్ద కిలోల కొద్దీ గోల్డ్, కోట్లలో డిపాజిట్లు, ఫ్లాట్లు, విల్లాలు.

అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారుల దాడుల్లో రహదారుల, భవనాల శాఖ ఈఎన్‌సీ గంగాధరం అక్రమాస్తులు లెక్కకు మించి బయటపడుతున్నాయి. హైదరాబాద్‌లోని బ్యాంకుల్లో కుటుంబసభ్యుల పేరిట ఉన్న ఐదు లాకర్లను ఏసీబీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారుల దాడుల్లో రహదారుల, భవనాల శాఖ ఈఎన్‌సీ గంగాధరం అక్రమాస్తులు లెక్కకు మించి బయటపడుతున్నాయి. హైదరాబాద్‌లోని బ్యాంకుల్లో కుటుంబసభ్యుల పేరిట ఉన్న ఐదు లాకర్లను ఏసీబీ అధికారులు తెరిచారు.

అమ్మో, ఇంత కూడబెట్టాడా... (ఫొటోలు)

ఏసీబీ చరిత్రలోనే పెద్ద కేసు: అవినీతి ఇంజినీర్‌పై ఏసీబీ విస్మయం ఏసీబీ చరిత్రలోనే పెద్ద కేసు: అవినీతి ఇంజినీర్‌పై ఏసీబీ విస్మయం

విశాఖ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్‌ ఆ వివరాల్ని వెల్లడించారు. ఒక లాకర్‌లో ఆస్తిపత్రాలు, మిగిలిన నాలుగింటిలో నాలుగు కేజీల బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయన్నారు.

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగళం: చీఫ్ ఇంజినీర్ అక్రమాస్తులు 100కోట్లకు పైనే!ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగళం: చీఫ్ ఇంజినీర్ అక్రమాస్తులు 100కోట్లకు పైనే!

లాకర్లు తెరిస్తే..

లాకర్లు తెరిస్తే..

దరాబాద్‌లో గల పలు బ్యాంకుల్లో ఆయనకు లాకర్లు ఉన్న సంగతిని తెలుసుకున్న ఏసీబీ
అధికారులు మొత్తం ఆరు లాకర్లు తెరిచారు. సనత్‌నగర్‌ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 777 గ్రాముల బంగారం, సనత్‌నగర్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 450 గ్రాముల బంగారం, సుందర్‌నగర్‌ ఆంధ్రాబ్యాంక్‌లో 585 గ్రాముల బంగారం, కూకట్‌పల్లి ఐఎన్‌జీ
వైశ్యబ్యాంక్‌లో 494 గ్రాముల బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కిలోల కొద్దీ బంగారం..

కిలోల కొద్దీ బంగారం..

కాగా, గత నాలుగు రోజుల క్రితం గంగాధరాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు
అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గంగాధరంకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఆస్తులకు
చెందిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే దాదాపు 100 కోట్ల ఆస్తులను
ఏసీబీ అధికారులు గుర్తించగా తాజాగా లాకర్లలో ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

లెక్కలు తేలడానికి నాలుగు రోజులు..

లెక్కలు తేలడానికి నాలుగు రోజులు..

ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ చీఫ్ గంగాధరం ఆస్తులు లెక్కకట్టడానికి నాలుగు రోజులు కూడా సరిపోలేదు. తవ్వే కొద్దీ ఆయన అక్రమాస్తులు బయటపడుతునే ఉన్నాయి. ఆయన అక్రమార్జన ఎంత? అన్నది ఏసీబీ అధికారులు ఎట్టకేలకు లెక్కతేల్చారు. గంగాధరం అక్రమంగా కూడబెట్టిన బంగారు ఆభరణాలను, విలువైన డాక్యుమెంట్లను మంగళవారం విశాఖ ఏసిబి కార్యాలయానికి తీసుకువచ్చారు.

90లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు

90లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు

గంగాధరం కుటుంబ సభ్యుల పేరిట ఐఎన్‌జి వైశ్యా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, పంజాబ్ నేషనల్ బ్యాంకుల్లో 90 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లను గుర్తించామని ఏసిబి డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ చెప్పారు.

అక్రమంగా కూడబెట్టారు.

అక్రమంగా కూడబెట్టారు.

అలగే, గంగాధరం, ఆయన కుటుంబ సభ్యుల పేరిట 50 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్‌లు ఉన్నాయని, ఇందులో గంగాధరం ఒక్కరి పేరుమీద 21.79 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ ఉందని ఆయన చెప్పారు. అలాగే నాలుగు కిలోల బంగారం లభించిందని ఆయన తెలియచేశారు. ఇప్పటి వరకూ గంగాధరం ఆదాయానికి మించి కూడబెట్టిన ఆస్తులు 10 కోట్లుగా గుర్తించామని డిఎస్పీ చెప్పారు. వీటి మార్కెట్ విలువ 150 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఫ్లాట్లు, విల్లాలు...

ఫ్లాట్లు, విల్లాలు...

గంగాధరం రూ.20లక్షలను షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టినట్లు గుర్తించామని ఏసీబీ అధికారి తెలిపారు. 9 లాకర్లను గుర్తించామని, వీటిలో ఏడు హైదరాబాద్ లో, రెండు విశాఖలో ఉన్నాయని చెప్పారు. చిత్తూరు, నెల్లూరు, రంగారెడ్డి, విశాఖ జిల్లాల్లో 54ఎకరాల భూములు, రాంకీ విల్లా, శ్వాన్ లేక్, కూకట్ పల్లిలో డూప్లెక్స్, హౌస్‌లతో కలిపి ఏడు ఫ్లాట్లు ఉన్నాయని తెలిపారు.

డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు..

డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు..

సుప్రజలో రూ.2కోట్లు, సమిత హోమ్స్‌లో రూ.1.3కోట్లు, మరో ఐదు కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టారని వివరించారు. ఎస్ఎస్ ఫామ్స్, ఆర్ఆర్ ఫామ్స్, ఐమాజిక్స్ పొలారసిస్‌లలో రూ.24లక్షల డిపాజిట్లున్నట్లు తెలిపారు. ఆర్ అండ్ బీ కాంట్రాక్టర్ నాగభూషణం, విశ్వేశ్వరరావు, కిశోర్ ఇళ్లపై దాడులు చేశామని, వారికి గంగాధరంతో ఉన్న సంబంధాలపై విచారణ చేస్తున్నామని వివరించారు.

English summary
The ACB sleuths on Tuesday opened three bank lockers belonging to tainted R&B engineer-in-chief (administration) M Gangadharam in Hyderabad and recovered 90 lakh worth fixed deposits. Gangadharam has already been arrested on charges of amassing wealth disproportionate to his known sources of income on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X