పవన్ కళ్యాణ్ లో ఓటమి భయం.. పిఠాపురం గ్రౌండ్ రియాలిటీ ఇదే: యాంకర్ శ్యామల

రాష్ట్రమంతా ఒక ఎత్తైతే పిఠాపురంలో ఎన్నికల రాజకీయం మరో ఎత్తుగా కొనసాగుతుంది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్ది పిఠాపురంలో ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరుకుంటుంది. ఈసారి ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృఢ నిశ్చయంతో ఉంటే, పవన్ కళ్యాణ్ ను గెలిపించడం కోసం పిఠాపురం నియోజకవర్గంలో సినీ, బుల్లితెర సెలబ్రిటీలు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ పై యాంకర్ శ్యామల షాకింగ్ కామెంట్స్
హైపర్ ఆది, జానీ మాస్టర్, హీరోయిన్ నమిత, మెగా హీరోలు పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు.
ఇక ఈ క్రమంలోనే తాజాగా వైసిపి నాయకురాలు, యాంకర్ శ్యామల పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. వైసిపి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓటమిపాలు అవుతారని.. ఆ భయంతోనే ఇంతమంది ఎన్నికల ప్రచారం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Fear of defeat in Pawan Kalyan This is the ground reality in Pithapuram Anchor Shyamala

వంగా గీతను ఓడించటం కష్టం
పిఠాపురంలో పవన్ గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పిఠాపురంలో వంగా గీతను మాత్రం ఓడించలేరని యాంకర్ శ్యామల ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కు నిజంగా పిఠాపురంలో గెలిచే అంత పవర్ ఉంటే హైపర్ ఆది లాంటి వాళ్ళని ఎందుకు ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

పిఠాపురంలో గ్రౌండ్ రియాల్టీ ఇదే
పవన్ కళ్యాణ్ కోసం ఎంతమంది పిఠాపురం వచ్చి ప్రచారం చేసిన గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ప్రజలందరికీ తెలుసని వైసిపి నేత వంగా గీత గెలుపు ఖాయమని అన్నారు. వంగ గీత క్రింది స్థాయి నుంచి ఎదిగిన నాయకురాలని, ప్రజలు ఆమెని ఆదరిస్తారని, పవన్ కళ్యాణ్ ఓటమి తధ్యం అన్నారు యాంకర్ శ్యామల.

మేనిఫెస్టో విడుదల రోజే కుప్పకూలిన కూటమి
ఇక టిడిపి బిజెపి జనసేన ఉమ్మడి మేనిఫెస్టో పై మాట్లాడిన యాంకర్ శ్యామల టిడిపి జనసేన బిజెపి మూడు పార్టీలు కూటమిగా బరిలోకి దిగుతారని అందరూ భావిస్తే మేనిఫెస్టో రిలీజ్ రోజునే కూటమి కుప్ప కూలింది అని, మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ ఫోటో లేదని, బిజెపి మేనిఫెస్టో తో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం వారి ఓటమికి సంకేతం అన్నారు.

మంచి చేసింది కాబట్టే సింగిల్ గా ప్రజల్లోకి వైసీపీ
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని ప్రయత్నాలు చేసిన ఏపీలో అధికారంలోకి వచ్చేది వైసీపీ నేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జనాల కోసమే పని చేసిందని, అందుకే ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గా ప్రజల్లోకి వెళ్లింది అన్నారు. ప్రజల కోసం చేసిన ఎన్నో మంచి పనులు ఈ ఎన్నికలలో వైసీపీని గెలిపిస్తాయని యాంకర్ శ్యామల ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+