ట్యాపింగ్ భయంతోనే గవర్నర్‌తో భేటీ: కెసిఆర్‌పై జూపూడి
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత ప్రమాదమో నిన్నటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు తెలియలేదని, ట్యాపింగ్ భయంతోనే ఈరోజు కేసీఆర్ గవర్నర్‌ను కలిసారని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకుడు జూపూడి ప్రభాకర రావు అన్నారు.
కెసిఆర్ అందరి ఫోన్లు ట్యాప్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై తెలుగు రాష్ర్టాల గవర్నర్ నరసింహన్ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
ఎమ్మెల్యేల ఫోన్లు కూడా తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని జూపూడి విమర్శించారు. ప్రజలపై గవర్నర్ నరసింహన్ చిన్న చూపు చూస్తున్నారని, తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతున్నా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

తెలంగాణ ప్రభుత్వం గీత దాటినా సెక్షన్ -8 అమలు కావడం లేదని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో ఏపీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నా గవర్నర్ పట్టించుకోవడం లేదని జూపూడి మండిపడ్డారు.
ఉద్యోగులను తీసుకోవాలి...
తెలంగాణ నుంచి రిలీవ్ చేసిన ఏపీ విద్యుత్ ఉద్యోగులను హైకోర్టు తీర్పును గౌరవించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ఈ విషయంలో గవర్నర్ చొరవ తీసుకోవాలని ఏపీ మంత్రి రావెల కిషోర్‌బాబు కోరారు. ఏపీలో 400 మంది తెలంగాణ ఉద్యోగులు ఉన్నారని ఆయన గుర్తుచేశారు. వారిని తాము ఎలాంటి ఇబ్బంది పెట్టడం లేదని రావెల అన్నారు.












Click it and Unblock the Notifications