అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హోదా సాధ‌న కోసం జేఏసి, వైసిపి- జ‌న‌సేనకు ఆహ్వానం, 11న ఢిల్లీలో దీక్ష‌: అఖిల‌ప‌క్ష భేటీలో నిర్ణయాలు

|
Google Oneindia TeluguNews

ఏపికి ప్ర‌త్యేక హోదా..విభ‌జ‌న హామీల సాధ‌న కోసం జేఏసి ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ జేఏసి లో రాజ‌కీయ పార్టీలు..ప్ర‌జాసంఘాలు..ఉద్యోగ‌..విద్యార్ది సంఘాలతో కమిటీ ఏర్పాటు చేసి పోరాట క‌మిటీ, ఎగ్జిక్యూటివ్ క‌మిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ జేఏసిలో స‌మావేశానికి హాజ‌రు కాని రాజ‌కీయా పార్టీల‌ను ఆహ్వానించాల‌ని నిర్ణ‌యిం చారు.

హోదా జేఏసి ఏర్పాటుకు నిర్ణ‌యం..

హోదా జేఏసి ఏర్పాటుకు నిర్ణ‌యం..

ఏపికి ప్ర‌త్యేక హోదా..విభ‌జ‌న హామీల సాధ‌న కోసం ప్ర‌త్య‌కంగా పోరాట క‌మిటీ..ఎగ్జిక్యూటివ్ క‌మిటీలు ఏర్పాటు చేయాల ని అఖిల ప‌క్ష స‌మావేశం నిర్ణ‌యించింది. ఇందు కోసం ప్ర‌త్యేకంగా జేఏసిని ఏర్పాటు చేయ‌నుంది. ఈ జేఏసి లో రాజ‌కీయ పార్టీలు..ప్ర‌జా సంఘాలు..ఉద్యోగ‌-విద్యార్ధి సంఘాల‌తో క‌మిటీ ఏర్పాటు కానుంది. ఇందు కోసం అఖిల‌ప‌క్ష స‌మావేశానికి హాజ‌రు కాని పార్టీల‌ను ఆహ్వానించార‌ల‌ని నిర్ణ‌యించారు. ముఖ్య‌మంత్రి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన అఖిల‌ప‌క్ష స‌మావేశానికి ఏపిలోని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు దూరంగా ఉన్నాయి. ఉద్యోగ సంఘాలు..ప్ర‌జా సంఘాల ప్ర‌తినిధులు పాల్గొన్నారు. విభ‌జ‌న నాటి నుండి ఏపికి జ‌రుగుతున్న అన్యాయాన్ని ముఖ్య‌మంత్రి వివ‌రించారు. కేంద్రం పై స‌మిష్టి గా పోరాటం చేయాల్సిన ప‌రిస్థితుల పై చ‌ర్చించారు.

ఢిల్లీ ఆందోళ‌న‌కు జ‌గ‌న్‌- ప‌వ‌న్ ల‌ను ఆహ్వానించండి....

ఢిల్లీ ఆందోళ‌న‌కు జ‌గ‌న్‌- ప‌వ‌న్ ల‌ను ఆహ్వానించండి....

సమావేశానికి హాజ‌రు కాని పార్టీల పై ముఖ్య‌మంత్రి ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేసారు. భవిష్యత్ ప్రణాళిక కోసమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాజకీయలబ్ధి చూసుకుని భేటీకి కొన్ని పార్టీలు రాలేదేమోనని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రజాసంఘాలే గట్టిగా పోరాడాయని చంద్రబాబు కొనియా డారు. హోదాపై పార్టీ పరంగా చేయాల్సిన ఆందోళనలపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 1న ప్రత్యేక హోదా సాధన సమితి బంద్‌కు సంఘీభావం తెలియజేయలేమని, కానీ అదే రోజు అసెంబ్లీలో చర్చించి బ్లాక్ డే పాటించాలని అనుకుంటున్నామని ఆయన అన్నారు. ఇక‌,స‌మైక్య ఉద్య‌మ స‌మ‌యంలో పెట్టిన కేసుల‌ను ఎత్తివేయాల‌ని ప‌లువురు ప్ర‌తినిధులు సీయం ను కోరారు. క్యాబినెట్ స‌మావేశంలో దీని పై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. అదే విధంగా ఢిల్లీలో చేసే పోరాటానికి జ‌గ‌న్ -ప‌వ‌న్ ల‌ను ఆహ్వానించాల‌ని కొంద‌రు సీయం కు సూచించారు.

ఢిల్లీ కార్యాచ‌ర‌ణ ఇలా..

ఢిల్లీ కార్యాచ‌ర‌ణ ఇలా..

పిభ్ర‌వ‌రి 1 నుండి 13 వ తేదీ వ‌ర‌కు వివిధ రూపాల్లో రాష్ట్రం త‌ర‌పున నిర‌స‌న‌లు నిర్వ‌హించాల‌ని అఖిల‌ప‌క్షం లో నిర్ణ యించారు. ఇందు కోసం అఖిల ప‌క్షం త‌ర‌పున క‌మిటీలు వేయాల‌ని నిర్ణ‌యించారు. 1వ తేదీన న‌ల్ల రిబ్బ‌న్‌లు తో పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మాలు శాంతియుతంగా నిర్వ‌హించాల‌ని డిసైడ్ అయ్యారు. 11వ తేదీన ఢిల్లీలో ఆందోళ‌న నిర్వ హించ‌నున్నారు. అదే రోజు ముఖ్య‌మంత్రి మంత్రులు, నేత‌లు దీక్ష నిర్వ‌హించనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇక‌, 12 వ తేదీన అఖిల‌ప‌క్ష నేత‌ల‌తో క‌లిసి రాష్ట్రప‌తిని క‌ల‌వాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యించారు. ఢిల్లీలో ఆందోళ‌న రెండు రోజు ల పాటు ఉండాల‌ని పలువురు ముఖ్య‌మంత్రి ని కోరారు. ఇక ప్ర‌ధానిని క‌ల‌వాల్సిన అవ‌స‌రం లేద‌ని..ఏపికి జ‌రిగిన అన్యాయం పై ఢిల్లీలో నిర‌స‌న‌లు చేసి నేరుగా రాష్ట్రప‌తిని క‌ల‌వాల‌ని తీర్మానించారు. ముఖ్య‌మంత్రి చేసే పోరాటానికి ఉద్యోగ ..ప్ర‌జా సంఘాలు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి.

English summary
All Party meeting headed by Cm Chnadra Babu in Amaravati decided to form JAC for Ap special status fight. From Feb 1st to 13th to do protest against central govt. On 11th Feb CM sit for one day Deekhsa in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X