వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపిలో వాలెంటైన్స్ డే కీల‌క పొలిటిక‌ల్ ఘ‌ట్టం మిస్ : అస‌లు కార‌ణం ఇదేనా..!

|
Google Oneindia TeluguNews

ఏపి లో ఫిబ్ర‌వ‌రి 14న...ఈ రోజున జ‌ర‌గాల్సిన రెండు కీల‌క ఘ‌ట్టాలు వాయిదా ప‌డ్డాయి. విప‌క్ష నేత జ‌గ‌న్ త‌న సొంతింటి గృహ ప్ర‌వేశం ఇదే రోజ‌న చేసి ఇక‌, ఇక్కడి నుండి ఎన్నిక‌ల స‌మ‌ర‌శంఖం పూరించాల‌ని భావించారు. అది వాయిదా ప డింది. ఇదే గృహ‌ప్రవేశానికి తెలంగాణ ముఖ్యంత్రి కెసిఆర్ ను ఆహ్వానించారు. విశాఖ‌లోనూ కేసీఆర్ ప‌ర్య‌ట‌న ఖ‌రారు అయింది. అయితే, రెండు కార్య‌క్ర‌మాలు వాయిదా ప‌డ్డాయి. ఇప్పుడు కార‌ణం ఏంట‌నే చ‌ర్చ మొద‌లైంది.

జ‌గ‌న్ గృహ ప్ర‌వేశం వాయిదా..
ఏపి రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలోని తాడేప‌ల్లిలో ఈ రోజున జ‌గ‌న్ గృహ‌ప్రేవేశ ముహూర్తం ఖరారైంది. ఒకే ప్రాంగ‌ణం లో సొంతింటి తో పాటుగా పార్టీ ఏపి కార్యాల‌యం సైతం నిర్మాణం పూర్తి చేసారు. ఈ గృహ ప్ర‌వేశానికి పార్టీ నేత‌ల‌తో పా టుగా.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కోసం తాను వ‌చ్చి క‌లుస్తానంటూ ఆఫర్ ఇచ్చిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు జ‌గ‌న్ ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించారు. అదే రోజు విశాఖ‌లో మ‌రో కార్య‌క్ర‌మానికి సైతం కేసీఆర్ రావాల్సి ఉండ‌టంతో తాడేప‌ల్లి వ‌స్తార‌ని అందరూ భావించారు.

Feb 14th Major Political issues post Phoned : Reason behind is..

అయితే, జ‌గ‌న్ త‌న గృహ ప్ర‌వేశ కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేసుకున్నారు. సోద‌రి ష‌ర్మిల జ్వ‌రంతో ఉండ‌టంతో ఈ కార్య‌క్ర‌మం వాయిదా వేసుకున్న‌ట్లు వైసిపి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అయితే, దీని వెనుక అస‌లు కార‌ణం ఏదో ఉంద‌నే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

విజ‌య‌సాయి త‌ర్వాత ల‌క్ష్యం ఆయ‌నే..! బీసి బాణం పై వైసీపి గురి..!!విజ‌య‌సాయి త‌ర్వాత ల‌క్ష్యం ఆయ‌నే..! బీసి బాణం పై వైసీపి గురి..!!

కేసీఆర్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ విశాఖపట్నం పర్యటన రద్దయింది. బడ్జెట్‌ రూపకల్పన, మంత్రివర్గ విస్తరణ సన్నాహాల దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాలని నిర్వాహకు లు ఆయనను ఆహ్వానించగా మొదట్లో అంగీకరించారు. ఈ నెల 17 నుంచి కేంద్ర ఆర్థిక సంఘం పర్యటించనుంది. సీఎంతో, అధికారులతో భేటీ, క్షేత్రస్థాయి పర్యటనలు జరగనున్నాయి.

Feb 14th Major Political issues post Phoned : Reason behind is..

కీలకమైన ఈ పర్యటనను పురస్కరించుకొని సీఎం గురువారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో ఆర్థిక సంఘానికి ఇవ్వాల్సిన నివేదిక తయారీ తోపాటు రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించే అంశంపై చర్చించనున్నారు. మంత్రివర్గ విస్తరణపై సీఎం ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. సీఎం విశాఖ పర్యటనను రద్దు చేసుకోవడం మంత్రివర్గ విస్తరణ వాదనకు బలం చేకూరుస్తుంది. ఆయన తరఫున ప్రశాంత్‌రెడ్డి విశాఖపట్నం వెళ్లనున్నారు. ఇలా..కార‌ణాలు ఏవైనా..14న ఏపిలో ఒక ఆస‌క్తి క‌ర రాజ‌కీయ ఘ‌ట్టం ఆవిష్కృత‌మ‌వుతుంద‌ని భావించిన వారికి నిరాశ మిగిలింది.

English summary
YCP Chief new house warming post phoned due to Sharmila illness. KCR AP tour cancelled due to planning commission tour in Telanagana. Same day two key leaders activities in AP has been cancelled. Now this issue became hot discussion in political circles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X