ఏబీ వెంకటేశ్వరరావు రియాక్షన్: సస్పెన్షన్‌పై చట్టపరంగా పోరాడుతా, పత్రికా ప్రకటన విడుదల

సస్పెన్షన్‌పై సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని ప్రతికా ప్రకటన విడుదల చేశారు. బంధుమిత్రులు, సన్నిహితులను ఉద్దేశించి ప్రకటన విడుదల చేశారు. సస్పెన్షన్‌తో తాను కృంగిపోనని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యను చట్టపరంగా ఎదుర్కొనే అవకాశాలను పరిశీలిస్తానని స్పష్టంచేశారు. తన సస్పెన్షన్ గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని పత్రికా ప్రకటనలో వెంకటేశ్వరరావు కోరారు.

నిబంధనల ఉల్లంఘన

నిబంధనల ఉల్లంఘన

అఖిల భారత ఉద్యోగుల సర్వీసుల నియమావళి, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 1989 బ్యాచ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు. పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ హోదాలో కొనసాగుతున్నారు.

అధికారం దుర్వినియోగం..

అధికారం దుర్వినియోగం..


విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా చాలాకాలం పాటు విధులను నిర్వర్తించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏబీ వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ బ్యురో అదనపు డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. అనంతరం ఆయనను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో ఏబీ వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ బ్యురో చీఫ్‌గా తన అధికారాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు.

కుమారుడి కంపెనీకి..

కుమారుడి కంపెనీకి..


ఏబీ వెంకటేశ్వర రావు పోస్టింగ్‌లో ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన ఓ సంస్థకు సెక్యూరిటీ పరికరాలను తయారు చేసే కాంట్రాక్టు పనులను ఇప్పించారంటూ విమర్శలు వచ్చాయి. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని.. దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. ఆరోపణలు నిజమేనని తేలడంతో.. ఏబీ వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్ వేటు వేసినట్టు తెలుస్తోంది. దీనిపై వెంకటేశ్వరరావు స్పందించారు. చట్టపరంగా పోరాడుతానని బంధుమిత్రులను ఉద్దేశించి పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+