Mahesh Kathi health Update: విషమంగానే మహేష్ కత్తి ఆరోగ్య పరిస్థితి.. చెన్నై అపోలో ఆస్పత్రికి తరలింపు...

సినీ నటుడు,విశ్లేషకుడు కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు నెల్లూరు మెడికవర్ వైద్యులు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో ఒక కన్ను పూర్తిగా దెబ్బతినట్లు తెలిపారు. మెదడుకు డిఫ్యూజ్ యాక్సోనల్ ఇంజురీ కారణంగా ఇప్పుడే ఏమీ చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ఆ గాయం పెరగకుండా ఉంటే మహేశ్‌కు ప్రమాదం తప్పినట్లేనని స్పష్టం చేశారు.

ప్రస్తుతం మహేష్‌ను నెల్లూరు నుంచి చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరికాసేపట్లో ఆయన్ను ఆస్పత్రిలో అడ్మిట్ చేస్తారని సమాచారం. అక్కడి న్యూరో సర్జన్ మహేష్ కత్తి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాక పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే 48 గంటలు గడిస్తే తప్ప ఇప్పుడే ఏమీ చెప్పకపోవచ్చునని తెలుస్తోంది.

film critic mahesh kathi health update he is shifted chennai hospital

రోడ్డు ప్రమాదంలో మహేష్ కత్తి ముఖానికి బలమైన గాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా ఆయన షాక్‌లోకి వెళ్లారు. షాక్ నుంచి తేరుకున్నప్పటికీ ముఖానికి అయిన గాయాల కారణంగా ఆయన తీవ్రంగా ఇబ్బందిపడుతుండటంతో వైద్యులు మత్తు మందు ఇచ్చినట్లు తెలుస్తోంది. మహేష్ కత్తి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ఆయన మద్దతుదారులు పోస్టులు పెడుతున్నారు.

చిత్తూరు జిల్లాలోని తమ స్వగ్రామానికి వెళ్తుండగా మహేష్ కత్తి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. నెల్లూరు జిల్లాలోని కొడవలూరు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ప్రమాదానికి గురైంది. ముందు ప్రయాణిస్తున్న ట్రక్కును వెనుక వైపు నుంచి ఇన్నోవా బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జవగా డ్రైవర్ పక్క సీట్లో కూర్చొన్న మహేష్ కత్తి తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.

ప్రమాదం అనంతరం మహేష్ కత్తిని నెల్లూరులోని మెడికవర్ ఆస్పత్రిలో చేరారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయన్ను చెన్నై అపోలో ఆస్పత్రికి తరలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+