మంచు మనోజ్ ఇలా చేశారేంటి?
కథానాయకుడు మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వినాయకచవితి రోజు మౌనికతో కలిసి మనోజ్ స్వామిని దర్శించుకోవడంతోపాటు కలిసి పూజలు చేశారు. అంతేకాదు.. సీనియర్ రాజకీయవేత్త గోనె ప్రకాశరావు కూడా వీరి వివాహాన్ని ధ్రువీకరించారు. తాజాగా మంచు మనోజ్ ట్వీట్ చేశారు. మౌనిక రెడ్డి తండ్రి దివంగత భూమా నాగిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని చేసిన ఈ ట్వీట్ లో ఆయన ''గొప్ప నాయకుడే కాదని, గొప్ప కొడుకు, గొప్ప భర్త, గొప్ప తండ్రి అని.. అంతకుమించి ఒక గొప్ప మనసున్న వ్యక్తి భూమా నాగిరెడ్డి అని, ఆయన మనమధ్య లేకపోయినా ఆశీస్సులు ఎప్పుడూ మనపైనే ఉంటాయంటూ'' ఎమోషనల్ ట్వీట్ చేశారు.
ఇటీవలే కడప దర్గాకు వెళ్లిన మనోజ్ అక్కడ మీడియాతో మాట్లాడారు. త్వరలోనే తాను కొత్త జీవితం ప్రారంభించబోతున్నానని, ఈసారి కుటుంబంతో కలిసి ఇక్కడకు వస్తానని వ్యాఖ్యానించారు. దీంతో మనోజ్-మౌనికరెడ్డి వివాహంపై ఒక స్పష్టత వచ్చింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మనోజ్ చేసిన ట్వీట్ వైరలైంది. ఇద్దరికీ ఇది రెండో వివాహమవుతుంది. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటున్న మనోజ్ ఇటీవలే అహం బ్రహ్మాస్మి అనే సినిమాను ప్రకటించారు. త్వరలోనే దీన్ని పట్టాలెక్కించి అభిమానులను కలవబోతున్నానంటూ గతంలోనే ఒక ట్వీట్ చేశారు.

కొంతకాలంగా మంచు మనోజ్, భూమా మౌనికల వివాహానికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇద్దరూ ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని వారి సన్నిహితులు వెల్లడించారు. అయితే మనోజ్ వివాహానికి మోహన్ బాబు ఒప్పుకోలేదని వార్తలు వచ్చినప్పటికీ అవి వాస్తవమా? కాదా? అనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు.













Click it and Unblock the Notifications