అమరావతికి ఆర్ధిక శోభ.. 25 బ్యాంకులు, శంకుస్థాపనకు నిర్మలా సీతారామన్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రత్యేకమైన దృష్టి సారించింది. రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడానికి కేంద్ర సహకారాన్ని కూడా తీసుకుంటుంది. ఇందులో భాగంగా భారీ నిధులను సమకూర్చుకుంటూ రాజధాని అమరావతిలో మళ్ళీ కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టడానికి కీలక సంస్కరణలను అమలు చేస్తోంది.

అమరావతిలో బ్యాంకుల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన
ఏపీ రాజధాని అమరావతిలో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేసే దిశగా నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం అమరావతిలో ఒకేసారి 12బ్యాంకుల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనుంది. ఇక ఈ కార్యక్రమానికి ఈనెల 28న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ రానున్నట్టు సమాచారం. ఆమె చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించింది. గత నెలలో ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.

Financial prosperity for Amaravati 25 banks Nirmala Sitharaman to lay foundation stone

Take a Poll

ఆర్బీఐ తో పాటు మొత్తం 25 బ్యాంకుల ఏర్పాటు
అయితే 12 బ్యాంకుల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సీతారామన్ ప్రత్యక్షంగా వచ్చి చేస్తారా లేకా, వర్చువల్ గా పాల్గొంటారా అనేది ఇప్పటివరకు ఇంకా స్పష్టత రాలేదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా మొత్తం 25 జాతీయ, ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు, అధికారుల నివాస భవనాల నిర్మాణాలకు అమరావతిలో శంకుస్థాపన జరగనుంది.

వైసీపీ హయాంలో ఆగిన పనులు
ఈ బ్యాంకు భవనాల కోసం స్థలం కేటాయించారు. చాలా బ్యాంకులు తమ స్థలాలను ఇప్పటికే సిద్ధం చేసుకుని నిర్మాణాలు ప్రారంభించేందుకు రెడీ అయ్యాయి. అయితే ఈ బ్యాంకులను ఏర్పాటు చేయడానికి భవన నిర్మాణాలకు 2014-2019 మధ్యలోనే స్థలాలు కేటాయించినప్పటికీ అప్పుడు పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత వైసిపి ప్రభుత్వ హయాంలో వీటి కోసం ఒక అడుగు కూడా ముందుకు పడలేదు.

అమరావతిని ఆర్థిక కేంద్రంగా మార్చే ప్లాన్ లో ఏపీ సర్కార్
ఇక ప్రస్తుతం బ్యాంకులకు ఒకేసారి అమరావతిలోని సిఆర్డిఏ ప్రధాన కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదికగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మొత్తం అన్ని బ్యాంకుల భవనాలకు ఒకేసారి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏపీ రాజధాని అమరావతిని ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో, ఇప్పటికే వివిధ బ్యాంకులకు కావలసిన, వారిని బ్యాంకులు ఏర్పాటు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది.

పెట్టుబడులను ఆకర్షించేలా చంద్రబాబు ప్లాన్
ఈ శంకుస్థాపన కార్యక్రమం ముగిసిన వెంటనే నిర్మాణ పనులను కూడా ప్రారంభిస్తారు. ఈ బ్యాంకుల ప్రాజెక్టు అమరావతిలో ఏర్పాటు చేయడం ద్వారా ఇది రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజధాని అమరావతిలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన అనేక నిర్మాణ పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఇక శంకుస్థాపన జరిగితే బ్యాంకుల నిర్మాణ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+