గోదారి పుష్కరాల్లో మరో అపశ్రుతి: భారీ అగ్నిప్రమాదం, అంధకారంలో రాజమండ్రి
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి పుష్కరాల్లో మరో అపశ్రుతి చోటు చేసుకుంది. రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. పుష్కరఘాట్ సమీపాన ఉన్న ఒక కిళ్ళీ షాపులో తొలుత ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

వెంటనే మంటలు మరో దుకాణానికి వ్యాపించాయి. సమీపంలోని ట్రాన్స్‌ఫారం పేలిపోయింది. పుష్కర యాత్రికులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. రాజమండ్రిలోని గోకవరం బస్ స్టాండ్ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది.

బస్టాండ్ సమీపంలోని జగదాంబ రెస్టారెంట్ వంటశాలలో గ్యాస్ లీక్ కావడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. మూడు పోలీసు వాహనాలు, కారు, ఓ ఆటో, పది ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి.













Click it and Unblock the Notifications