హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం: 4గురు సజీవ దహనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Fire accident in Hyderabad, four dead
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని గగన్ పహడ్‌లో గురువారం వేకువజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శంషాబాద్ సమీపంలోగల అక్షిత రబ్బరు ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు సజీవ దహనమయ్యారు.

ఫ్యాక్టరీలోని బాయిలర్ ట్యూబ్ లీక్ అయి కార్మికులు నిద్రిస్తున్న గదిలో రబ్బరు మిశ్రమం పడటం వలన ఈ ప్రమాదంలో వారు మృతి చెందారు. మృతులు బీహార్‌వాసులు. వారిని సంజీవ్ కుమార్, నవీన్ యాదవ్, కిషన్, గోవింద్ చౌదరిలుగా గుర్తించారు.

అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మండలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాల పైన అధికారులు దర్యాఫ్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఫ్యాక్టరీ యజమాని కైలాష్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. కంపెనీ యాజమాన్యం కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతదేహాలను వెలికి తీస్తున్నారు.

కిరణ్ దిగ్భ్రాంతి

గగన్ పహాడ్ ప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. మృతదేహాలు గుర్తు పట్టలేకుండా ఉన్నాయని, డిఎన్ఏ పరీక్షల అనంతరం కుటుంబ సభ్యులకు అందజేస్తామని పోలీసులు చెప్పారు.

English summary
Four people died in a massive fire that broke out 
 
 Thursday morning at Gaganpahad in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X