రోడ్డు ప్రమాదంలో లారీ దగ్థం
విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ దగ్థమైంది. జాతీయ రహాదారిపై రద్దీ సమయంలో ప్రమాదం జరగటంతో ప్రజలు ఆందోళన చెందారు. జాతీయ రహదారిపై తాటిచెట్లపాలెం నుంచి అక్కయ్యపాలెం వైపు లారీ వస్తోంది. ఆ సమయంలో సర్వీసు రోడ్డు నుంచి ఓ వ్యక్తి బైక్ పై వచ్చాడు. దీంతో సిగ్నల్ దాటిన లారీ వేగంగా బైక్ ను ఢీ కొట్టింది. డ్రైవ్ చేస్తున్న వ్యక్తి గాయాలతో బయటకు పడగా బైక్ మాత్రం లారీ కింద చిక్కుకుంది. లారీ కొంత దూరం బైక్‌ను ఈడ్చుకుంటూ రావడం.. ఆ రాపిడికి మంటలు చేలరేగటం క్షణాల్లో జరిగింది. వెంటనే మంటలు లారీకి వ్యాపించింది. అందరూ చూస్తుండగా లారీ మొత్తం దగ్థమైంది.












Click it and Unblock the Notifications