శ్రీహరికోటలో అగ్నిప్రమాదం: నిల్వ ఉంచిన ఇంధనంలో మంటలు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
శ్రీహరికోట: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఘన ఇంధనం, ఇంధన వ్యర్థాలను నిల్వ ఉంచిన 146వ భవనం నుంచి రాత్రి 7:10 గంటల సమయంలో పెద్దయెత్తున మంటలు ఎగసిపడ్డాయి.
మంటలను గుర్తించిన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. రెండు అగ్నిమాపక యంత్రాలు అతి కష్టం మీద మంటలను అదుపు చేశాయి. ప్రమాదంలో భవనం తలుపులు, మరికొంత సామగ్రి కాలిపోయినట్లు సమాచారం.

ప్రమాద కారణాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాద సమయంలో విధుల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. 2004 ఫిబ్రవరి 23న కూడా ఇంధన నిల్వ భవనంలో ప్రమాదం జరిగింది. నాటి దుర్ఘటనలో ఆరుగురు షార్ ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు.












Click it and Unblock the Notifications