పూల మార్కెట్లో భారీ ప్రమాదం, మహిళ సజీవ దహనం
విజయవాడ: ఏపీలోని విజయవాడ పూల మార్కెట్లో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రాజకుమారి అనే మహిళ మృతి చెందారు. పూల మార్కెట్లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. పూల దుకాణాలు తగలబడిపోయాయి.
మంటలు శరవేగంగా విస్తరించి.. సమీపంలోని పూరి గుడిసెలకు అంటుకున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. మంటల్లో మాత్రం మహిళ సజీవ దహనమయింది.

మార్కెట్ పక్కనే ఉన్న పూరిగుడిసెల్లో పేదలు, బడుగు జీవులు నివసిస్తుంటారు. ఇక్కడ దాదాపు 150కి పైగా గుడిసెలు ఉన్నాయి. అగ్ని ప్రమాదం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆకతాయిల పని కూడా కావొచ్చంటున్నారు. అయితే, గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications