ఆ 15 నిమిషాలు ఎంతో కీలకం: చరిత్ర పుటల్లోకి జీజీహెచ్ (ఫోటోలు)
గుంటూరు: నవ్యాంధ్రలో గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసిన మొట్టమొదటి ప్రభుత్వాసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్) రికార్డు సృష్టించింది. ఇప్పటికే దేశంలోని నాలుగు ప్రభుత్వాసుపత్రుల్లో ఈ గుండె మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతుండగా ఐదో ఆసుపత్రిగా గుంటూరు జీజీహెచ్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది.
ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే శుక్రవారం గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు గుండె మార్పిడి శస్త్రచికిత్స ప్రారంభించి సాయంత్రం 4.30 గంటలకు ముగించారు.
డాక్టర్ గోఖలే నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో డాక్టర్ సుధాకర్, సుబ్రహ్మణ్యం, భరద్వాజ్, శ్రీనివాస్, షరీఫ్, అనూషలతో పాటు జీజీహెచ్‌కు చెందిన 45 మంది పారామెడికల్ సిబ్బంది భాగస్వాములు అయ్యారు. గుండె తరలింపునకు యంత్రాంగం గ్రీన్‌ఛానల్ పద్ధతిని ఎంచుకుంది.
గుండెను ఎలాంటి ఇబ్బందులు లేకుండా 15 నిమిషాల్లో గుంటూరు జీజీహెచ్‌కు తరలించేందుకు సహకరించాలంటూ వైద్యులు గుంటూరు ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కోరారు. దీనికి స్పందించిన ఆయన శుక్రవారం ఉదయం నుంచి మంగళగిరి- గుంటూరు మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా 'గ్రీన్‌చానల్' ఏర్పాటు చేశారు.

గుంటూరులో తొలిసారిగా గుండె మార్పిడి ఆపరేషన్
విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఇమడాబత్తుని ఏడుకొండలు(44) ఈ నెల 13న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 19న ఆయన బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదే సమయంలో గుంటూరు నగర శివారులోని స్వర్ణభారతినగర్‌కు చెందిన ఉప్పు ఏడుకొండలు జీజీహెచ్‌లో ఆరు నెలలుగా గుండె జబ్బుతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు.

గుంటూరులో తొలిసారిగా గుండె మార్పిడి ఆపరేషన్
గుండె పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో గుండె మార్పిడి చేయాలని డాక్టర్ గోఖలే నిర్ణయించారు. దాతల కోసం ఐదు నెలలుగా ఎదురుచూస్తున్నారు. డాక్టర్ గోపాలకృష్ణ గోఖలేకు బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి ఎన్నారై ఆసుపత్రిలో ఉన్న విషయం గురువారం రాత్రి 7 గంటల సమయంలో తెలిసింది. అప్పటికే గుంటూరు జీజీహెచ్ నుంచి ముగ్గురు వ్యక్తులకు గుండె అవసరమని జీవనధాన్ ట్రస్టులో పేర్లు నమోదు చేశారు.

గుంటూరులో తొలిసారిగా గుండె మార్పిడి ఆపరేషన్
వారిలో తొలుత గుండె మార్పిడి ఇతనికి అవసరమవుతుందని వెంటనే ఇతనికి గుండె ఇవ్వటానికి అంగీకరించాలని జీవనధాన్ ట్రస్టు అధికారులతో మాట్లాడి ఒప్పించారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్ అయిన ఇమడాబత్తుని ఏడుకొండలు కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. దాత, స్వీకర్తల బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ అవడంతో గుండెను గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఉప్పు ఏడుకొండలుకు అమర్చాలని నిర్ణయించారు.

గుంటూరులో తొలిసారిగా గుండె మార్పిడి ఆపరేషన్
ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో బ్రెయిన్‌డెడ్ అయిన ఇమడాబత్తుని ఏడుకొండలుకు శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకూ శస్త్రచికిత్స చేసి నుంచి గుండెను సేకరించారు. వారు ఆమోదం తెలపగానే హైదరాబాద్ నుంచి డాక్టర్ గోఖలే హుటాహుటినా ముగ్గురు వైద్యులను వెళ్లాలని ఆదేశించారు. అనంతరం ఆయన కూడా హైదరాబాద్‌లో బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఎన్నారై ఆసుపత్రికి చేరుకున్నారు.

గుంటూరులో తొలిసారిగా గుండె మార్పిడి ఆపరేషన్
ఈ శస్ట్రచికిత్సకు అవసరమైన వ్యయాన్ని మొత్తాన్ని తొలుత సహృదయ ట్రస్టు భరించింది. మంగళగిరి టోల్‌ప్లాజా నుంచి జీజీహెచ్‌కు వచ్చే దాకా దారి పొడవునా ఎక్కడికక్కడ పోలీసులను మొహరించి ఆ ప్రత్యేక అంబులెన్స్‌కు ఎక్కడా అసౌకర్యం కలగకుండా గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

గుంటూరులో తొలిసారిగా గుండె మార్పిడి ఆపరేషన్
అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదేశాల మేరకు మంగళగిరి, పెదకాకాని, పాతగుంటూరు, కొత్తపేట, లాలాపేట పోలీసులు వారి వారి పరిధిలోకి ఈ అంబులెన్స్ రాగానే ఎక్కడికక్కడ అది ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్‌ను నిలుపుదల చేసి వాహనదారులను, పాదచారులను అప్రమత్తం చేశారు. ప్రతి మార్గంలోకి అంబులెన్స్ ప్రవేశించేటపుడు లోకల్ పోలీసులు ప్రత్యేకంగా రోడ్లను క్లియర్ చేసి కేవలం 14 నిమిషాల్లో గుండెను జీజీహెచ్‌కు తరలించారు.

గుంటూరులో తొలిసారిగా గుండె మార్పిడి ఆపరేషన్
కాగా ఆపరేషన్ చేసిన పేషెంట్ ఏడుకొండలకు వెంటిలేటర్‌పై ఉంచి సేవలు అందిస్తున్నారు. 2, 3 రోజుల్లో అతను మాట్లాడతారని డాక్టర్ గోఖలే తెలిపారు. పూర్తిస్థాయిలో అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయటానికి 10 నుంచి నెల రోజులు సమయం పడుతుంది. అప్పటి దాకా వైద్యుల పర్యవేక్షణలోనే అతను ఉంటారు. ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిన తర్వాత రెండు, మూడు మాసాల పాటు వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని సూచించారు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్












Click it and Unblock the Notifications