వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భద్రత గుప్పిట్లో రాష్ట్రం.. ముమ్మర తనిఖీలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ నేపథ్యంలో రాత్రి వేల పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలో పోలింగ్ సజావుగా సాగడానికి నిర్వహించే ఉద్దేశ్యంతో ఎక్కడికక్కడ పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. పోలింగ్ రోజు రాత్రి పెద్ద ఎత్తున డబ్బులు, మద్యం, ఇతర గృహోపకరణాలను ఎరగా చూపించి, ఓటర్లను ప్రలోభానికి గురి చేసే అవకాశాలు వుంటాయని అనుమానాలతో వాహనాలను విస్తృతంగా సోదాలు చేశారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి బందోబస్తు..

రాష్ట్రంలో అత్యంత సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో ఉండే పోలింగ్ కేంద్రాలకు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. సమస్మాత్మక, సున్నిత ప్రాంతాలకు అదనపు బలగాలను చేరవేశారు. జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిఘా పెట్టారు. జిల్లా పోలీసులతో పాటు కేంద్ర బలగాలు, పారా మిలటరీ సిబ్బందిని మోహరింప చేశారు. అక్కడి ప్రాంతాలను బట్టి.. సిబ్బంది సంఖ్యను పెంచారు.

 first phase poll: huge number of security forces deployed in andhra pradesh

ఈవీఎంల తరలింపుపై డేగకన్ను..

పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల తరలింపు మొదలుకుని, పోలింగ్ ముగిసిన తరువాత వాటిని నిర్దేశిత ప్రాంతాలకు తరలించేంత వరకూ అప్రమత్తంగా ఉండేలా ఏర్పాట్లు ;పూర్తి చేశారు. పోలింగ్ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో తొమ్మిది వేల వరకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని గుర్తించారు. చాలామటుకు జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచబోతున్నామని చెప్పారు. 46,397 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 4,619, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 2,304 అదనపు పోలింగ్ కేంద్రాలను నెలకొల్పబోతున్నామని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా పోలీసులు ఉంటారని అన్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తామని అన్నారు. వీడియోలు తీస్తామని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మైక్రో అబ్జర్వర్లుగా నియమించడానికి చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా ద్వివేదీ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు.

English summary
Huge number of security forces deployed in the State of Andhra Pradesh in the row of First Phase of General Elections. State Police, Paramilitary forces, CRPF Jawans are deployed in the sensitive Areas
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X