పెన్షన్‌లపై తొలి సంతకం..! ఏపీని ఉద్యోగాంద్ర చేస్తానన్న జగన్...!!

Recommended Video

    పెన్షన్‌లపై తొలి సంతకం!! APని ఉద్యోగాంద్ర చేస్తానన్న జగన్!! | Oneindia Telugu

    అమరావతి/హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి పెన్షన్‌లపై తొలి సంతకం చేశారు. రాష్ట్రంలోని వృద్ధులకు రూ.2250 నెలకు పెన్షన్ కింద ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వెంటనే పెన్షన్‌పై మొదటి సంతకం పెట్టారు. అంతే కాకుండా ప్రతి ఏడాది ఈ పెన్షన్ మొత్తాన్ని పెంచనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం దీనిని 2500 రూపాయలు చేయనున్నట్లు, ఆ తదుపరి సంవత్సరం 2750 రూపాయలు, అనంతరం 3000 రూపాయలకు పెంచనున్నట్లు జగన్ తెలిపారు. తాను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఓ ముసలి అవ్వ చెప్పిన సంగతులను గుర్తు చేసుకున్నారు. అవ్వతాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతున్నామని, రెండు చేతులు జోడించి పేరుపేరునా ఆశీస్సులు కోరుతున్నానని జగన్ అన్నారు.

     ఉద్యోగాలు...ప్రక్షాళనలు...! గ్రామ వాలంటీర్లుగా యువత..!!

    ఉద్యోగాలు...ప్రక్షాళనలు...! గ్రామ వాలంటీర్లుగా యువత..!!

    వైఎస్ జగన్ అనే నేను ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నాను అంటూ ప్రమాణం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఒకరిగా మీలో నిలిచినందుకు ఆకాశమంత విజయాన్నిఅందించినందుకు ప్రతి ఒక్కరికీ రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రికి, రేపు తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న స్టాలిన్ కి , పెద్దలందరికీ పేరుపేరునా నమస్సుమాంజలి తెలుపుకుంటున్నానని అన్నారు. రాజకీయ జీవితంలో పాదయాత్రలో పెదల కష్టాన్ని చూసానని అన్నారు. పేదల కష్టాన్ని చూసిన తర్వాత మీ అందరికీ నేను ఉన్నానని అన్నారు. మీ బాధలు విన్నాను...నేను ఉన్నానని అన్నారు.

     పథకాల పట్ల కాల్ సెంటర్..! ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుసంధానం..!!

    పథకాల పట్ల కాల్ సెంటర్..! ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుసంధానం..!!

    అందరి ఆశలు...ఆకాంక్షలు పూర్తిగా పరిగణలోకి తీసుకుంటూ రెండు పేజిలతో రూపొందించానని మ్యానిఫెస్టోను తెలిపారు. ఎన్నికల అయిన తర్వాత చెత్తబుట్టలో పడేసేలా పెద్ద బుక్ లు తీసుకురాలేదని పేర్కొన్నారు. రెండు పేజీలతో మ్యానిఫెస్టో మీ కండ్ల ముందు ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సూచించారు. మ్యానిఫెస్టోనూ భగవత్ గీతగా, ఖురాన్ గా, భగవత్ గీతగా భావించి పాటిస్తానని హామీ నిచ్చారు. నవరత్నాల్లో ప్రజలకు మాటిచ్చినట్టు అవ్వా తాతల ఆశీస్సుల కోసం పెన్షన్ 3,000రూపాయలు ఇవ్వనున్నట్టు తెలిపారు. మొట్టమొదటి సంతకం అవ్వాతాతల పెన్షన్ జూన్ నుంచి 2,250 రూపాయలతో మొదలు పెడుతున్నట్టు పేర్కొన్నారు.

    గ్రామ సెక్రెటేరియట్లు..! అందరికి ఉద్యోగాలు..!!

    గ్రామ సెక్రెటేరియట్లు..! అందరికి ఉద్యోగాలు..!!

    మొదటి సంతకం పెన్షన్ పై చేశారు. ప్రతి ఏడాది 250 రూపాయలు పెంచుకుంటూ పోతున్నట్టు చెప్పారు. వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు ఆగస్టు 15తేదీ వరకు గ్రామాల్లో గ్రామ వ్యాలంటీర్లుగా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు, లంచాలు లేని పరిపాలన చేసేందుకు గ్రామ వాలంటీర్లను నియమిస్తున్నట్టు చెప్పారు. ఐదు వేల రూపాయ జీతంతో గ్రామ వ్యాలంటీర్లు నియమిస్తున్నట్టు చెప్పారు. ఏ పథకంలో ఎటువంటి కక్కుర్తి ఉండకూడదని ఐదు వేల రూపాయలు వాలంటీర్లకు ఇస్తున్నట్టు చెప్పారు. ఏ ఒక్కరికీ ప్రభుత్వ సేవలు అందించకపోతే ఆగస్టు 15న కాల్ సెంటర్ ద్వారా నేరుగా సీఎంకే ఫోన్ చేయవచ్చన్నారు.

     గాంధీ జయంతి రోజున మరికొన్ని ఉద్యోగాలు..! యువతకు వరాలు కురిపించిన జగన్..!!

    గాంధీ జయంతి రోజున మరికొన్ని ఉద్యోగాలు..! యువతకు వరాలు కురిపించిన జగన్..!!

    సీఎం ఆఫీస్ నెంబరు అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పారు. గాంధీ జయంతి నాడు మరో లక్షఅరవై వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన కోసం పూర్తిగా ప్రక్షాళన చేస్తానని అన్నారు. కాంట్రాక్టర్లు అవినీతి చేయకుండా రివర్స్ టెంటరింగ్ తీసుకువచ్చామన్నారు. అవినీతి పై తాము చేస్తున్న ఈ దండయాత్రపై కొన్ని పత్రికలు... ఎల్లోమీడియా తప్పుగా చూపిస్తే ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఒకవేల అలా రాసిన పత్రికలు రాస్తే వారిపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+