చోరీలు: వ్యసనాలకు బానిసలు, బైక్ మోజు (పిక్చర్స్)

విశాఖపట్నం: చెడు అలవాట్లకు బానిసై నలుగురు, మద్యానికి అలవాటు పడి ఒకరు, బైకులపై మోజుతో మలుగురు మైనర్లు, ఒక వ్యక్తి చోరీలకు పాల్పడ్డారు. విశాఖపట్నంలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధుల్లో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు మైనర్లను జ్యువెనైల్ హోమ్‌కు, ఓ వ్యక్తిని రిమాండ్‌కు తరలించారు, ఆ చోరీలకు సంబంధించిన వివరాలను క్రై డిసిపి జె. మురళీధర్ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

గాజువా కుంచుమాంబ కాలనీకి చెందిన చప్పిడి యేసురాజు, పాత గాజువాక డ్రైవర్స్ కాలనీకి చెందిన తాటిపూడి రామచంద్రరావు, చింతల పురుషోత్తం, శ్రామికనగర్‌కు చెందిన ఉలవల రాజేష్ కలిసి దేవాలయాలు, గోడౌన్లు, ద్విచక్ర వాహనాలు, కార్ల వంటివి దొంగిలిస్తూ ఏడు చోరీలకు పాల్పడ్డారు.

గాజువాక సిఐ దర్యాప్తు చేపట్టి శుక్రవారం ఉదయం యేసురాజు, తాటిపూడి రామచంద్రరావును అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి నుంచి రెండు మోటారు సైకిళ్లు, ఒక ఇన్నోవా కారు, ల్యాప్‌టాఫ్, కంప్యూటర్ పరికరాలతో పాటు సీతారామలక్ష్మణ, హనుమంతుడి విగ్రాహాలు, సాయిబాబా వెండి పాదుకలు స్వాధీనం చేసుకున్నారు.

ఐదుగురి అరెస్టు

ఐదుగురి అరెస్టు

వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో ఏడు దొంగతనాల్లో పాలు పంచుకున్న ఐదుగురిని వేర్వేరు పోలీసు స్టేషన్ల పరిధుల్లో పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

ఐదుగురి అరెస్టు

ఐదుగురి అరెస్టు

మహిళల మెడల్లో గొలుసులను లాక్కుని పోతు గాజువాక ప్రాంతంలో చోరీలకు పాల్పడుతున్న శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన నారు సతీష్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఐదుగురి అరెస్టు

ఐదుగురి అరెస్టు

సతీష్ ఆటో నడుపుతూ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. డబ్బు కోసం చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడ్డాడు. ఇతను మూడు నేరాలు చేశాడు.

ఐదుగురి అరెస్టు

ఐదుగురి అరెస్టు

సతీష్‌ను దువ్వాడ పోలీసులు కూర్మన్నపాలెం వద్ద అదుపులోకి తీసుకున్నారు. సతీష్ నుంచి పోలీసులు 75 గ్రాముల పుస్తెలతాడును స్వాధీనం చేసుకున్నారు.

ఐదుగురి అరెస్టు

ఐదుగురి అరెస్టు

చెడు వ్యసనాలకు బానిసై డబ్బు కోసం ఇళ్లలో చోరీలకు పాల్పడుతును్న ఓ యువకుడని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. విజయనగరం జిల్లా లంకాపట్నం గంజిపేటకు చెందిన దలాయి కిరణ్ కుమార్ అలియాస్ బంగారి కుమార్ అలియాస్ సొట్ట కుమార్ ఆటో డ్రైవర్‌గా, స్టేజీ డ్యాన్సర్‌గా పనిచేస్తూ వస్తున్నాడు.

ఐదుగురి అరెస్టు

ఐదుగురి అరెస్టు

దలాయి కిరణ్ కుమార్ గత నెల 10వ తేదీన ధామ్‌సన్ స్ట్రీట్‌లోని మైలపల్లి లక్ష్మి అనే మహిళ ఇంట్లో చోరీ చేశాడు. రూ. 40 వేల వీలువనై బంగారు ఆభరణాలు చోరీ చేశాడు.

ఐదుగురి అరెస్టు

ఐదుగురి అరెస్టు

కిరణ్ కుమార్‌ను టౌన్‌హాల్ రోడ్డులో పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 38వేల రూపాయల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఐదుగురి అరెస్టు

ఐదుగురి అరెస్టు

పుక్కుల అచ్యుతరావు, మరో నలుగురు మైనర్లు గత నెల 31వ తేదీన బీచ్‌ రోడ్డులో అర్థరాత్రి మోటార్ సైకిల్‌పై చక్కర్లు కొడుతూ పోలీసులకు చిక్కారు. వారు బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఐదుగురి అరెస్టు

ఐదుగురి అరెస్టు

బైక్ చోరీలకు పాల్పడుతున్నవారి నుంచి పోలీసులు ఆరు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అచ్యుతరరావును రిమాండ్‌కు, నలుగురు మైనర్లను జ్యువెనైల్ హోమ్‌కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+