ప్రమాదంలో 6గురు, ఈతకు వెళ్లి 4గురు మృతి

అనంతపురం/కర్నూలు: అనంతపురం జిల్లా గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లె సమీపంలో బుధవారం తెల్లవారుజామును రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ - ఆటో ఢీ కొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియవచ్చింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. పెడబల్లి నుంచి బాగేపల్లి వెళుతుండగా ప్రమాదం జరిగింది. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్లు చేపట్టారు.

వ్యాపారి గొంతు కోసి డబ్బు అపహరించిన దుండగుడు

Five dead in road accident

వ్యాపారి గొంతు కోసి రూ.3.50 లక్షల నగదును దోచుకెళ్లాడో దుర్మార్గుడు. ఈ ఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తుమ్మికానిపల్లి గేటు వద్ద జరిగింది. ఈ సంఘటనలో తీవ్ర రక్తస్రావానికి గురైన వ్యాపారి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. వ్యాపారిపై దాడి చేసి దొంగతనానికి పాల్పడిన వ్యక్తి గతంలో అతని వద్దే డ్రైవర్‌గా పని చేసేవాడని గుర్తించారు.

కర్నూలులో రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లా రైల్వే కోడూరు మండలం బాలపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

ఎస్బీఐలో రూ.18 లక్షలు స్వాహా

కడప జిల్లా బద్వేలు ఎస్బీఐలో గుమస్తా రూ.18 లక్షలు స్వాహా చేసిన సంఘటన వెలుగు చూసింది. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు గుమాస్తా పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

ఈతకు వెళ్లిన విద్యార్థులు మృతి

విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చంపావతి నదిలో ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన బోగాపురం మండలం నందిగామలో చోటు చేసుకుంది.

ఆస్పత్రిలో కన్నుమూసింది

గుంటూరు జిల్లా కొరిటెపాడుకు చెందిన దమయంతి అనే మహిళను ఆమె కొడుకు, ముగ్గురు కుమార్తెలు ఈ నెల 7న అనారోగ్యంతో ఉన్న ఆమె ఎలాగూ మృతి చెందుతుందని భావించి బతికుండగానే శ్మశానానికి తీసుకువెళ్లారు. చనిపోయే వరకు అక్కడే ఉంచాలని నిర్ణయించారు. ఈ విషయమై పెద్ద దుమారం రేగడంతో పోలీసులు ఆమెను జీజీహెచ్‌లో చేర్పించారు. ఆస్పత్రిలో చేరినా ఆ వ్యధతోనే రాలిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+